ETV Bharat / state

పండగ వేళ 'భారీ తగ్గింపు' అంటూ ఆన్​లైన్​లో వినియోగదారులకు వల - డెలివరీ అయ్యాక చూస్తే!!

పండగ సీజన్లో సైబర్‌ కేటుగాళ్ల టోకరా - నకిలీ షాపింగ్‌ వెబ్‌సైట్లతో ఘరానా మోసాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Fake Website Scams in Online Shopping
Fake Website Scams in Online Shopping (ETV Bharat)

Fake Website Scams in Online Shopping : గుంటూరు జిల్లాలోని మంగళగిరికి చెందిన రమణ అనే వ్యక్తి యూట్యూబ్‌లో 'ఫార్మల్‌షాప్‌' వెబ్‌సైట్‌ పేరుతో ఓ యాడ్‌ చూశారు. 'రూ.10 వేలు ఆ పైన విలువ చేసే బ్రాండెండ్‌ దుస్తులు అతి తక్కువ ధరకు అందిస్తున్నాం. స్టాక్‌ ఉన్నంత వరకే ఈ ఆఫర్​ అమల్లో ఉంటుంది. త్వరపడండి' ఇది ఆ యాడ్‌లోని సారాంశం. దసరా పండుగ సందర్భంగా అన్ని షాపులు, వెబ్‌సైట్లలానే వీరూ కూడా భారీ తగ్గింపు ధరకు అమ్ముతూ ఉండవచ్చని రమణ భావించారు. ఈక్రమంలోనే ఆ లింక్‌ను క్లిక్‌ చేశారు. ఆ వెబ్‌సైట్‌లో రూ.8000 నుంచి రూ.10 వేల విలువైన దుస్తుల్ని కేవలం రూ.899, రూ.999, రూ.1499కి ఇస్తున్నట్లు ఉంది. అందులోనే 7 రోజుల రిటర్న్‌ పాలసీ కూడా ఉంది.

దీంతో 4 చొక్కాల కాంబో ప్యాక్‌ను 'క్యాష్‌ ఆన్‌ డెలివరీ' పద్ధతిలో బుక్‌ చేశాడు రమణ. ఈ క్రమంలో పార్శిల్‌ రమణ ఇంటికి వచ్చింది. తెరిచి చూస్తే ఏముంది ఓ పాత చొక్కా, చినిగిపోయిన ప్యాంట్‌ ఉంది. దీంతో షాక్​ అయిన రమణ వెంటనే రిటర్న్‌ పాలసీలో పంపాలని చూస్తే ఆ ఆప్షన్‌ పని చేయలేదు. కస్టమర్‌ కేర్‌ నంబర్‌ అందులో లేదు. ఈ మెయిల్‌కు స్పందన కరవు. డెలివరీ చేసిన సంస్థను సంప్రదిస్తే లోపల ఉన్న వస్తువులతో తమకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో తాను మోసపోయినట్టు అర్థమైంది రమణకు.

ఆన్​లైన్ షాపింగ్ చేస్తున్నారా? తొందరపడితే డబ్బులు పోతాయ్ - జర జాగ్రత్త! - Online Shopping Traps

కేటుగాళ్లకూ పండగే : పండుగల సీజన్‌ కావడంతో అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకొనేలా ఆఫర్ల జోరు సాగుతోంది. అన్ని పేరు మోసిన షాపింగ్ షాపులు, వైబ్​సైట్ల ఆఫర్లు ప్రకటించాయి. ఇదే అదనుగా భావించిన సైబర్‌ కేటుగాళ్లు కూడా చెలరేగిపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి కళ్లు చెదిరే ఆఫర్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కొనుగోలుదారుడికి ఏ మాత్రం అనుమానం రాకుండా అత్యంత ఆకర్షణీయంగా నకిలీ వెబ్‌సైట్లను కేటుగాళ్ల రూపొందిస్తున్నారు. వెబ్‌సైట్‌ కింద చూస్తే సంస్థ చిరునామా, కాంటాక్ట్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ అడ్రస్, టోల్‌ఫ్రీ నంబర్లు కూడా అందుబాటు ఉంచారు. రిఫండ్‌ పాలసీ, షిప్పింగ్‌ పాలసీ ఇలా అన్నీ ఉంటాయని కస్టమర్స్​ను నమ్మిస్తున్నారు. ఆర్డర్‌ చేశాక ట్రాకింగ్‌ ఐడీలను కూడా కల్పించారు. కానీ ఇవన్నీ వినియోగదారుల్ని తమ బుట్టలో పడేయడానికే.

మొత్తం నగదు కాజేస్తారు : బంఫర్​ ఆఫర్​ అంటూ వివిధ రకాల వెబ్​సైట్​లను నమ్మి ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తే అసలు పార్శిల్‌ వచ్చే అవకాశమే ఉండదు. బ్యాంకింగ్‌ వివరాల్ని ట్రాక్‌ చేసి అకౌంట్​లో ఉన్న మొత్తం సొమ్మును కాజేసే ప్రమాదం కూడా ఉంది.

పండగ వేళ ఆన్​లైన్ సేల్స్ జోరు- వారంలోనే రూ.54వేల కోట్ల ఆర్డర్స్​ - Festive Season Online Sales

ఈ జాగ్రత్తలు తీసుకోండి : పేరు ప్రఖ్యాతులున్న వెబ్​సైట్లు, అధికారిక పోర్టల్స్​, యాప్​లలోన్​ ఆన్​లైన్​ షాపింగ్​ చేయండి. ప్రతి వెబ్​సైట్​లో 'కాంటాక్ట్​ అజ్​' (Contact Az) అనే పేజీ ఉంటుంది. అందులో వాళ్ల అడ్రస్​, ఈమెయిల్​ ఐడీలు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్​ చెేసుకొండి. ఇవి లేని వాటిలో ఆన్​లైన్​ షాపింగ్​ అసలు చేయొద్దు. మరి కొన్ని సందర్భంలో అవీ ఉన్నా ఫేక్​ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అవే డీటెయిల్స్​తో మీరు నెట్​లో వెతికితే సంబంధిత చిరునామాలో వెబ్​సైట్​ కార్యాలయం ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. అదే అడ్రస్​తో ఒకటి కంటే ఎక్కువ వెబ్​సైట్లు ఉంది అది కచ్చితంగా నకిలీదే అని నిర్థారించుకోవాలి.

ఆన్​లైన్​ షాపింగ్​ చేసే సమయంలో వెబ్​సైట్​లోకి వెళ్లినప్పుడు అడ్రస్​ బార్​లో యూఆర్​ఎల్​కు (URL) ఎడమవైపున ఉన్న ప్యాడ్​లాక్​ చూడండి. ఈ ప్యాడ్​లాక్​ టీఎల్ఎస్​/ఎస్​ఎస్​ఎల్​ (TLS/SSL) సర్టిఫికేట్​తో సైట్​ సేఫ్​ అని సూచిస్తుంది. ఒకవేళ ఈ సర్టిఫికేట్లు లేకపోతే ' ! ' అనే గుర్తు వస్తుంది. అంటే ఈ వెబ్​సైట్​ సురక్షితం కాదని అర్థం చేసుకోవాలి. వెబ్​సైట్​ డిజైనింగ్​ తేడాగా ఉన్నా, స్పెల్లింగ్​ తప్పుగా ఉన్నా అది సరైంది కాదని అర్థం.

ఆన్​లైన్​​ నేరాలకు చెక్​ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాలు - ఇకపై జిల్లాకో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ - Cyber ​​Crime Police Station in AP

ఆన్​లైన్​ షాపింగ్​ చేసేటప్పుడు ఎక్కువగా 'క్యాష్​ ఆన్​ డెలివరీ' (Cash on Delivery) విధానంలోనే ఆర్డర్​ బుక్​ చేసుకోవాలి. డెలివరీ బాయ్​ సంరక్షణలో పార్సిల్​ను ఓపెన్​ చేసేలా చూసుకోవాలి. వచ్చిన పార్శిల్​ను ఓపెన్​ చేసేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. అదే మీకు ఉన్నా అతి పెద్ద ఆధారం. నకిలీ వెబ్​సైట్లులను గుర్తించడానికి ‘స్కామ్‌ అడ్వైజర్‌.కాం’ (scamadviser.com) లాంటివి సహకరిస్తాయి. వీటిలో మనం షాపింగ్​ చేయాలనుకునే వెబ్​సైట్​ యూఆర్​ఎల్​ కోడ్​ను నమోదు చేస్తే అది ఎంతవరకు శ్రేయస్కరమో తెలియజేస్తుంది.

ఆన్​లైన్​ షాపింగ్​ చేసి మోసపోతే consumerhelpline.gov.in వెబ్​సైట్​ల్లో బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. 1800-11-4000 లేదా 14404 నంబర్‌లకు (ఉదయం 9:30 గంటల to సాయంత్రం 5:30 మధ్య) ఫోన్‌ చేయవచ్చు. 8130009809కు ఎస్‌ఎంఎస్‌ (SMS) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌ (NCH) యాప్‌ద్వారా కూడా బాధితులు జరిగిన మోసాన్ని తెలియజేయవచ్చు.

అధిక వడ్డీ ఆశచూపి కోట్లలో వసూలు చేసి ఉడాయింపు - లబోదిబోమంటున్న బాధితులు - Two Crore Fraud In Satya Sai

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.