ETV Bharat / state

ఎంత చదివినా గుర్తుండటం లేదా? - ఈ టిప్స్ పాటిస్తే మీ మైండ్ సూపర్ కంప్యూటరే!

జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునేందుకు పలు సూచనలు చేసిన నిపుణులు

memory_improvement_skills
memory_improvement_skills (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 3:14 PM IST

Updated : Oct 28, 2024, 3:31 PM IST

Memory Improvement Skills : రోజూ మనం ఎన్నో చూస్తాం. ఏవేవో చదువుతుంటాం. అనేకమందితో మాట్లాడుతుంటాం. కానీ, అవన్నీ అంతగా గుర్తుండవు. చదువు విషయానికే వస్తే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో కొందరు చదివింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాసి మంచి మార్కులు సాధిస్తే, ఇంకొందరు మాత్రం ఎంత శ్రద్ధగా చదివినా పరీక్షల సమయానికి మరిచిపోతుంటారు. పరీక్షలు సరిగా రాయలేక తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడం ఎలా? ఇందుకోసం అసలేం చేయాలో నిపుణులు సూచించే కొన్ని పద్ధతులివే.

  • మెదడు చురుగ్గా పనిచేయాలంటే జీవనశైలి సరిగ్గా ఉండాలి. రాత్రి పదింటిలోపే పడుకుని, ఉదయం ఐదింటికల్లా నిద్రలేవాలి. నాణ్యమైన నిద్రతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడంతో పాటు సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.
  • చురుగ్గా వినడం ప్రాక్టీసు చేయాలి. కేవలం కంటితో చూస్తూ చదవడం మాత్రమే కాకుండా చురుగ్గా వినడం అలవర్చుకోవాలి. చదివిన, విన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ మీకు మీరే ప్రశ్నలు సంధించుకోవడం, ఒకదానికొకటి అనుసంధానించడం, సమ్మరీ తయారు చేసుకోవడం ఇలా ప్రాక్టీసు చేస్తే ఎప్పటికీ గుర్తుండే వీలుంటుంది.
  • మెమొరీని పెంచుకోవడంలో విజువలైజేషన్‌ టెక్నిక్‌ చాలా ముఖ్యమైనది. మీరు చదివిన లేదా చూసిన వాటిలో ఏదైనా అంశాన్ని ఊహాత్మకంగా లేదా మెదడులో ఒక రూపాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆ సమాచారం అవసరమైనప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది.
  • చదివిన దాన్ని ఎప్పటికప్పుడు రీకాల్‌ చేసుకోవాలి. కేవలం పరీక్షలోనే కాకుండా సాధారణ సమయాల్లోనూ ఈ ప్రక్రియను ఆచరించాలి. అలాగైతే ఆయా అంశాలపై పట్టు ఏర్పడుతుంది.
  • సమాచారాన్ని అంశాల వారీగా చిన్న భాగాలుగా విభజించుకోండి. తద్వారా త్వరగా అర్థమవుతుంది. పరీక్షల సమయంలో/అవసరమైనప్పుడు సులభంగా రీకాల్‌ చేసుకోగలరు.
  • రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన డైట్‌ పాటించడం మరిచిపోవద్దు. వ్యాయామం మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. సమాచారాన్ని రీకాల్‌ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • మీకు తెలిసిన/నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం, చర్చించడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మరింతలా గుర్తుండేలా ఉపయోగపడుతుంది.

మెదడుకు శ్రమ : ముందుగా మెదడు యాక్టివ్​గా, ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి చురుకుగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం మెదడుకు కాస్త శ్రమ అవసరమంటున్నారు. ముఖ్యంగా చిన్న లెక్కల కోసం కూడా కాలిక్యులేటర్ యూజ్ చేయడం మానుకోవాలి. అలాగే తరచుగా పదవినోదం, సుడోకు, చెస్, పజిల్స్ లాంటివి ఆడుతూ ఉండాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల మెదడు పనితీరు క్రమంగా మెరుగవడం మీరు గమనించొచ్చంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

వాట్సాప్​లో ఇంట్రస్టింగ్ చాట్ మెమరీ ఫీచర్!- ఇది ఎలా పనిచేయనుందంటే?

చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? - బ్రెయిన్​లో ఏదో జరుగుతోందని టెన్షన్​ పడుతున్నారా?? - ఇలా చేయండి!

Last Updated : Oct 28, 2024, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.