ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో విస్తుగొల్పే అంశాలు! - Phone Tapping Case Update - PHONE TAPPING CASE UPDATE

BRS Involvement in Phone Tapping : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సంచలనం విషయాలు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం రూపంలో బయట పడ్డాయి. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో విస్తుగొల్పే విషయాలను కస్టడీ విచారణలో రాధాకిషన్ రావు వెల్లడించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లు కూడా బహిర్గతం అయ్యాయి.

Phone Tapping Case Update
Phone Tapping Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 10:49 PM IST

Ex DCP Radha Kishan Rao Key Facts in Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. భారత రాష్ట్ర సమితి పార్టీకి (బీఆర్ఎస్) ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అప్పటి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైనా ఓ కన్నేసి ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టామన్నారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్‌ చేసినట్లు వివరించారు.

BRS Party Involvement in Phone Tapping : కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. అలానే జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచామన్నారు. అంతేకాకుండా కొందరు మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలైన వాట్సప్‌, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరించినట్లు, ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డులను ప్రణీత్‌రావు విశ్లేషించినట్లు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

బీఎల్‌ సంతోష్‌ను అడ్డంపెట్టుకుని లిక్కర్ స్కాం నుంచి కవితను తప్పించాలని ప్లాన్ : అదేవిధంగా ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయంపై ఎస్ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు తనతో చర్చించాడని దర్యాప్తు బృందానికి వివరించారు. పైలట్ రోహిత్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముందుగా గుర్తించి, కమలానికి చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పారని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు వివరించారు. ఈక్రమంలోనే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఆడియోలను ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర లేపారని వెల్లడించారు.

కాషాయ పార్టీ అగ్ర నేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాపింగ్ చేసిందని తెలిపారు. స్కెచ్‌ ప్రకారమే మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో చర్చలు జరిపి, బీజేపీ అగ్రనేత బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న బీజేపీ, తమతో సయోధ్యకు వచ్చేలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. అయితే కొంతమంది సైబరాబాద్ పోలీసుల అసమర్థత వల్ల అరెస్టు ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం చెందారని మాజీ డీసీపీ చెప్పుకొచ్చారు.

రాధాకిషన్‌రావు స్వామిభక్తి - ఇంతకంటే ఎక్కువ చెప్పలేను! - Phone Tapping Case Updates

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.