ETV Bharat / state

జగన్‌ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్‌ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour

EX CM Jagan Tirumala Tour: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెను దుమారం రేగిన వేళ, మాజీ సీఎం జగన్‌ చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు.

EX CM Jagan Tirumala Tour
EX CM Jagan Tirumala Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 7:24 AM IST

EX CM Jagan Tirumala Tour : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన చేసిన ప్రతి సారీ వివాదాస్పదం అవుతోంది. గతంలో సీఎం హోదాలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నిరసన గళాలను తొక్కిపెట్టి తిరుమలలో పర్యటించారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారు. దీనిపై హిందూ వాదులు, సాధు సంతుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందు పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమల వచ్చిన జగన్‌, తన మందీ మార్భలంతో చేసిన హంగామా అప్పట్లో వివాదాస్పదమైంది.

Jagan Declaration Issue : తిరుమల గిరులను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరు మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పరిసర ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా నడుస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే క్యూ కాంప్లెక్స్‌లోకి గతంలో జగన్‌ ఏకంగా పాదరక్షలతో ప్రవేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. తిరుమలలో పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా నినాదాలు చేయడం నిషేధం. కానీ జగన్‌ పర్యటించిన ప్రతిసారీ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్‌లో జై జగన్‌ అంటూ అనుచరులు నినాదాలు చేసినా, వారిని ఏ రోజూ వారించిన పాపాన పోలేదు.

వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందా లేదా? - డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా జగన్​?: సీఎం చంద్రబాబు - CM Chandrababu on YS Jagan

గోవింద నామస్మరణల్లో జగన్‌ పేరు : గోవింద నామస్మరణలు మినహా మరే పదం వినిపించకూడని ప్రాంతంలో తన పేరున నినాదాలు చేసే అనుచరులను ఆపకపోగా చిద్విలాసంతో వారిని మరింత ప్రోత్సహించేలా వ్యవహరించడం హిందూవాదులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా తిరుమల పర్యటనలను ఇష్టారీతిన సాగించిన జగన్‌, సీఎంగా ఉన్న సమయంలో మరింత అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సంప్రదాయాలు, నిబంధనలు తనకేమీ వర్తించవన్న రీతిలో వ్యవహరించారు. శ్రీవారి ఆలయంలో తులాభారం చేసే సమయంలో జగన్‌ పిన్నమ్మ, అప్పటి టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భార్య గోవింద నామస్మరణల్లో జగన్‌ పేరు కలిపి స్మరించడం తీవ్ర వివాదాస్పదమైంది.

జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం : గత పర్యటనల్లో జగన్‌, ఆయన అనుచర గణం చేసిన అరాచకాలను గుర్తు చేసుకుంటున్న భక్తులు, శనివారం ఆయన తిరుమల పర్యటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేగా పర్యటనకు వస్తున్న జగన్‌, తిరుమల సంప్రదాయాలను పాటించాలని కోరుతున్నారు. అన్యమతస్థులు తిరుమలలో పర్యటించినపుడు శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు ఉన్నాయంటూ డిక్లరేషన్‌ ఇచ్చే నిబంధన, సంప్రదాయాలను జగన్ అనుసరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీవారి పట్ల విశ్వాసం లేని జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని సాధుపరిషత్‌ ప్రకటించింది.

శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్‌ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy

డిక్లరేషన్‌ ఇస్తేనే దర్శనం : పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంతో పాటు ఐదేళ్ల పాలనా కాలంలో తిరుమల పవిత్రత, ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన జగన్‌కు ఏడు కొండల వాడిని దర్శించుకునే హక్కు లేదంటూ ధార్మిక సంఘాలు నిరసనలను తీవ్రం చేశాయి. మరోవైపు జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు.

"లడ్డూ అంటే ఇది" - ఊపిరి పీల్చుకుంటున్న శ్రీవారి భక్తులు - "ఆనంద నిలయం"లో హర్షాతిరేకాలు - TIRUMALA LADDU QUALITY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.