ETV Bharat / state

తెలంగాణ సాధనలో అన్నింటా తానైన భాగ్యనగరి - నాటి పోరాట స్మృతులను ఓసారి గుర్తుచేసుకుందాం రండి!! - Telangana Formation Day 2024 - TELANGANA FORMATION DAY 2024

Decade Celebrations of Telangana State : తెలంగాణ ఏర్పడి 10ఏళ్లు గడిచినా సొంత గడ్డ కోసం చేసిన పోరాటాలు ఎన్నిటికీ మరువలేనివి. హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు ఆనాటి పోరాటాలను ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం.

Telangana_Formation_Day_2024
Telangana_Formation_Day_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 3:23 PM IST

Telangana Formation Day 2024 : ఎందరో అమరుల బలిదానాల మీద ఏర్పడ్డ గడ్డ తెలంగాణ. ఈ రాష్ట్రానికి చాలా ప్రత్యేక ఉంది. ఎన్నో సంవత్సరాలు సొంత రాష్ట్రం కోసం త్యాగాలు, పోరాటాలు చేస్తే చివరకు ఎందరో బలిదానం తర్వాత తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం పోరాటాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు అనేక మంది పోరాటం చేశారు. దాని ఫలితంగా 2014 జూన్​ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది.

రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ముఖ్యంగా హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు ఆనాటి పోరాటాల ఘటనలు ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. మిలియన్‌ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం ఇలా అనేక స్మృతులు పెనవేసుకున్న భాగ్యనగరం దశాబ్ది వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆనాటి ఘటనలను మరోసారి గుర్తు చేసుకుందాం.

Telangana_Formation_Day_2024
ఆనాడు ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ (ETV Bharat)

ప్రజల్లో నమ్మకాన్ని పెంచిన మిలియన్ మార్చ్ : ఈజిప్టు దేశంలోని కైరో పట్టణలో తెహ్రిక్ చౌక్​ వద్ద రాజుకు వ్యతిరేకంగా 10లక్షల మంది మిలియన్​ మార్చ్ నిర్వహించారు. దాన్నే స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ వాసులు హైదరాబాద్​లో మిలియన్​ మార్చ్​ కార్యక్రమాన్ని 2011 మార్చి 10వ తేదీన నిర్వహించారు. అప్పుడే ఇంటర్​ పరీక్షలు జరుగుతుండడంతో మధ్యాహ్నం 1గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేశారు. 144 సెక్షన్​ విధించినా లెక్కచేయకుండా సొంత రాష్ట్రం కోసం అశేష జనవాహిని చేరుకుని మార్చ్​ని విజయవంతం చేశారు. ఆ సంఘటన ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్న నమ్మకాన్ని పెంచింది.

ఇటు చదువు, అటు 13 రకాల నృత్యాల్లో ప్రతిభ - మోడలింగ్​లో రాణిస్తున్న ప్రీతి పట్నాయక్​ - Pre Teen India title winner Preethi

రాజకీయ జేఏసీ 2012 సెప్టెంబర్​ 30న హైదరాబాద్​లో తెలంగాణ మార్చ్​ నిర్వహించింది. అనంతరం దీని పేరును సాగరహారంగా మార్చారు. తెలంగాణ మార్చ్​ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగవని, జేఏసీ లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ప్రభుత్వం అనుమతించింది. వేదికను ట్యాంక్​బండ్​ నుంచి నెక్లెస్​ రోడ్డుకు మార్చుకోవాలని తెలిపింది.

Telangana_Formation_Day_2024
నినాదాలు చేస్తున్న మహిళ (ETV Bharat)

అలా ప్రభుత్వ అనుమతితో గన్‌పార్క్‌ స్థూపం, ఇందిరాపార్క్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ ఇలా అనేక చోట్ల నుంచి ఊరేగింపులు ప్రారంభయ్యాయి. నెక్లెస్‌ రోడ్డులో సాగరహారానికి పోలీసులు ఎన్ని నిర్భంధాలు విధించినా బారికేడ్లు, ఇనుప కంచెలను తెంచుకుని తెలంగాణ ఉద్యమ కారులు లక్షలాదిగా తరలివచ్చారు. రాత్రి 7 గంటలు దాటినా ఎవ్వరూ అక్కడి నుంచి కదలకపోవడంతో ఉద్యమకారులపై పోలీసులు భాష్పవాయువులను ప్రయోగించారు.

Telangana_Formation_Day_2024
అమరవీరుల స్థూపం (ETV Bharat)

మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మె : సొంత రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ వాసులందరూ భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు ప్రస్ఫుటించేలా 2011 సెప్టెంబర్​ 13న శ్రీకారం చుట్టిన సకల జనుల సమ్మె మలిదళ ఉద్యమలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సమ్మెలో రాజధాని పరిధిలోని లక్షలాది మంది ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బడిపిల్లలు సైతం రాష్ట్ర సాధన కోసం రోడ్డెక్కారు. ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంలా మారింది. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. 42 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగిందంటే రాష్ట్రం కావాలన్న ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి: ఏబీ వెంకటేశ్వరరావు - Government Orders on ABV Posting

భైరవానితిప్ప ప్రాజెక్టుపై జగన్​ సర్కార్​ నిర్లక్ష్యం - అనంతవాసులకు తీరని ద్రోహం - Bhairavani Tippa Project

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.