ETV Bharat / state

విద్యుత్​ సిబ్బంది సాహసం - గిరిజన గ్రామాల్లో వెలుగులు - Electrical Staff Adventure - ELECTRICAL STAFF ADVENTURE

Electrical Staff Adventure Walking on Wires To Electrician Service in Alluri : అంధకారంలో ఉన్న గిరిజన గ్రామాలకు వెలుగులు తీసుకురావడానికి విద్యుత్​ సిబ్బంది సాహసం చేస్తున్నారు. వాగు మీదుగా తాడుపై ప్రమాదకరంగా నడుచుకుంటూ వెళ్లి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

current_problem
current_problem (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 8:29 AM IST

విద్యుత్​ సిబ్బంది సాహసం - గిరిజన గ్రామాల్లో వెలుగులు (ETV Bharat)

Electrical Staff Adventure Walking on Wires To Electrician Service in Alluri : వాగులు, గెడ్డలు ఉప్పొంగితే రాకపోకలు బంద్‌ అయిుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యావసరాలు దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. ఇక విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందంటే పరిస్థితి మరింత దయనీయమని చెప్పాలి. అందుకేనేమో అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణకు ఏపీఈపీడీసీఎల్​ (EPDCL) సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.
అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం- విరిగిన కొండచరియలు, స్తంభించిన జన జీవనం - rain updates

సాహస ప్రయాణం : వరదల సమయంలో అత్యావసర సేవలందించే ప్రభుత్వ సిబ్బంది సాహస ప్రయాణం. ఎలాంటి అడ్డంకులు ఉన్నా వెరవకుండా ప్రజలకు సేవలందించి విధి నిర్వహణ పట్ల ఉన్న నిబద్ధతను విద్యుత్‌ సిబ్బంది చాటుకుంటున్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవిలో ఇటీవల వర్షాల కారణంగా సున్నంపాడు గ్రామానికి వెళ్లే విద్యుత్ లైన్‌పై చెట్లు పడిపోయాయి. దీంతో సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి ఆదేశాలతో మారేడుమిల్లి ఏఈ శ్రీనివాస్ పర్యవేక్షణలో లైన్‌మెన్ సిబ్బంది సాహసోపేతంగా పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap

విద్యుత్‌ సిబ్బంది నిబద్ధత : ఈ మార్గంలో పెద్ద కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై వంతెన లేకపోవడంతో వాగు దాటడం ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ లైన్‌మన్లు రామయ్య, నీలన్నదొర విధి నిర్వహణే ధ్యేయంగా వాగుపై అటూ ఇటు ఉన్న చెట్లకు తాళ్లు కట్టించారు. ప్రమాదకర పరిస్థితుల్లో తాడుపై నడుస్తూ వాగు దాటారు. విద్యుత్ లైన్‌కు మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించారు. సాహసం చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన లైన్‌మెన్ సిబ్బందిని రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి అభినందించారు.

వరద బాధితులను ఆదుకుంటాం- పంట నష్టాన్ని అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశాలు - Chandrababu on Floods in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.