ETV Bharat / state

ఫ్లయింగ్​ స్క్వాడ్​ నిర్వాకం - తక్కువ ఉన్నా ఎక్కువ చూపి నగదు స్వాధీనం - Election Flying Squad in Kadapa

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 11:46 AM IST

Election Flying Squad in Kadapa: రూ. 50 వేల లోపు ఉన్న నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసి సీజ్‌ చేశారని కటిక వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది వద్ద ఉన్న 4లక్షల 90వేల రూపాయలు నగదును ఒకరి వద్దే ఉన్నట్లు చూపించి జప్తు చేశారని ఆరోపించారు.

Election_Flying_Squad_in_Kadapa
Election_Flying_Squad_in_Kadapa

Election Flying Squad in Kadapa: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక అక్రమంగా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు దృష్టి సారించారు. వాహనాల తనిఖీల్లో రోజూ లక్షల కొద్దీ నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. సరైన రసీదులు చూపని నగదు, బంగారాన్ని ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిస్తున్నారు. రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు ఉండి దానికి సంబంధించిన పత్రాలు లేకపోతే ఎన్నికల అధికారులు సీజ్‌ చేసే అవకాశం ఉంది. కాని ఇందుకు భిన్నంగా కడపలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు వ్యాపారులను దగా చేశారు. తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ ఎక్కువగా ఉన్నాయని చూపించి వ్యాపారుల పొట్ట కొట్టడం సరికాదని బాధితులు వాపోయారు.

ఫ్లయింగ్​ స్క్వాడ్​ నిర్వాకం - తక్కువ ఉన్నా ఎక్కువ చూపి నగదు స్వాధీనం

ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా - ఒక్క జిల్లాలోనే రూ. 4.5 కోట్లు సీజ్ - Money Seize at Checkposts

Kadapa Traders Angry About Manner Of Election Flying Squad: వైఎస్సార్ జిల్లాలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తీరుపై కటిక వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేకలు కొనుగోలు కోసం వెళ్తుండగా ఎర్రగుంట్ల వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసి తమ వద్ద ఉన్న చిన్నపాటి నగదును సీజ్‌ చేశారని కటిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

వాహనాల తనిఖీలో భారీగా బంగారం పట్టివేత - డ్రైవర్ సీటు కింద పెట్టి తరలిస్తుండగా స్వాధీనం

కడపకు చెందిన కటిక వ్యాపారులు జీవాలు కొనుగోలు కోసం ఈరోజు తెల్లవారుజామున సంతకు వెళ్తుండగా వైయస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వారిని తనిఖీ చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ. 15,000, 20,000 30,000 వరకు మాత్రమే నగదు ఉన్నాయి. ఏ ఒక్కరి వద్ద కూడా 50 వేలకు మించి నగదు లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 50 వేల రూపాయిల కన్నా ఎక్కువ తీసుకెళ్తుంటే జప్తు చేయాలని ఆదేశించారు. కానీ వీరి వద్ద అతి తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి 8 మంది వద్ద ఉన్న 4లక్షల 90వేల రూపాయిల నగదు ఒకరి వద్దనే ఉన్నట్లు చూపించి జప్తు చేశారని ఆరోపించారు. దీనిపై వ్యాపారులు ప్రశ్నించినప్పటికీ ఆ డబ్బులను కడప ట్రెజరీ కార్యాలయంలో అప్పగించారు. ఈ మేరకు కటిక వ్యాపారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల విభాగ అధికారిని సంప్రదించారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారి అలా చేయడం తప్పని మీ డబ్బులను వారం లోపల ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు శాంతించారు.

Gold And Silver Jewelery Seized By Police At Kodikonda Check Post: బెంగళూరు నుండి అనంతపురానికి తరలిస్తున్న బంగారు, వెండి అభరణాలు కోడికొండ చెక్​పోస్ట్​లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం చెక్​పోస్ట్ అధికారులు వాహనాలు తనిఖీలో భాగంగా బొలెరో వాహనం తనిఖీ చేశారు. అందులో దాదాపు రూ. 8 కోట్ల పైబడి విలువ చేసే బంగారం, వెండి అభరణాలు, వజ్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి బీవీసీ కంపెనీకి చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఇన్వాయిస్ చూపుకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకొని చిలమత్తూరు పోలీస్ స్టేషన్​కు తరలించారు. కర్నూలు ఆదాయపు పనుల శాఖ జాయింట్ కమిషనర్​కు సమాచారం అందించడంతో ఈరోజు ఇక్కడ చేరుకుని వీటి విలువ నిర్ధారిస్తారని పోలీసులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు, నెల రోజుల్లో సుమారు 500 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.