Election Code Violation : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘింస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ అధికారులు పలుమార్లు నొక్కి చెప్పినా కొంత మంది ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లు పెడచెవిన పెట్టారు. చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్ధిల వెంట గ్రామాల్లో తిరిగేస్తున్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు- వెంటనే స్పందించిన అధికారులు
Volunteers Participate YCP Election Campaign : ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని అధికారులు సృష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయడం లేదు. వైసీపీ నాయకులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని 18 వ సచివాలయం పరిధిలో పనిచేసే వాలంటీర్ ధనుంజయ మంగళవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ కండువాను కప్పుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వార్డు వాలంటీర్ ధనుంజయపై అధికారుల వేటు వేశారు. ధనుంజయను విధుల నుంచి తొలగిస్తూ పురపాలక కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో విచిత్ర ఎన్నికల నియమావళి - వైఎస్సార్సీపీకి వర్తించని కోడ్ నిబంధనలు
Anakapalli District : అధికారుల పార్టీకి ఓటేయాలంటూ ప్రచారం చేసిన ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటీర్లు బోళెం ఓంకార విజయలక్ష్మీ, శింగంపల్లి దుర్గాభవాని ఈ నెల 15న ఇంటింటికీ వెళ్లి ఎన్నికల్లో జగన్కు ఓటెయ్యాలంటూ ప్రచారం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రవి దృష్టికి వెళ్లింది. వారిపై అధికారులతో దర్యాప్తు చేయించారు. అధికారులిచ్చిన నివేదిక ఆధారంగా వారిని విధుల నుంచి తొలగించాలని ఎన్నికల అధికారి జయరాంకు ఆదేశాలిచ్చారు.
అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీ నాయకుల అండచూసుకొని వాలంటీర్ల దౌర్జన్యాలకు హద్దుల్లేకుండా పోతుంది. గొలుగొండ మండలం పరిధిలో వాలంటీర్, ఆమె భర్త పాత కక్షల నేపథ్యంలో సొంత అన్న కుటుంబంపై దాడికి దిగారు. వైసీపీ ఓట్లు వేయాలని, ఇంటిపై పార్టీ జెండాలను కట్టాలని వాలంటీర్ దంపతులు చెప్పండంతో దానికి బాధిత కుటుంబం వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహించిన వాలంటీర్ దంపతులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఘటనపై టీడీపీ నేత అయన్నపాత్రుడు తనయుడు విజయ్ తీవ్రంగా ఖండించారు
వైసీపీ ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్- 30 మంది వాలంటీర్లపై వేటు
NTR District : ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ బ్యాంకు ఉద్యోగి వైసీపీ కార్యకర్తలా ప్రత్యక్షమయ్యారు. ఎన్నికల కోడ్ విడుదలైనా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వల్లభనేని మణికంఠ తన బాధ్యతలను విస్మరించి మంత్రి జోగి రమేష్ వెంట ఎన్నికల ప్రచారంలో హడావుడి చేస్తున్నారు. వైసీపీకి ఓటేయాలంటూ మంత్రి అడుగులో అడుగులు వేస్తున్నారు. మన గుర్తు ఫ్యాన్ అంటూ హడావుడి చేస్తుడంతో స్థానికలతో పాటు వైసీపీ కార్యకర్తలు అవాక్కయ్యారు. మణికంఠ ఉద్యోగంలో కన్నా వైసీపీ సేవలో ఎక్కువ తరిస్తున్నట్లు విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.