ETV Bharat / state

చంద్రబాబు క్యాబినెట్​లో ఉన్నత విద్యావంతులు - మంత్రివర్గంలో డాక్టరేట్‌లు, లాయర్లు, ఇంజినీర్లు - cm Chandrababu Naidu Cabinet - CM CHANDRABABU NAIDU CABINET

Educated Ministers in AP CM Chandrababu Naidu Cabinet : రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య, న్యాయ పట్టభద్రులతో పాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చేసినవారూ ఉన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్‌ చదివారు. నిమ్మల రామానాయుడు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు.

Educated Ministers in AP CM Chandrababu Naidu Cabinet
Educated Ministers in AP CM Chandrababu Naidu Cabinet (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 10:48 AM IST

Educated Ministers in AP CM Chandrababu Naidu Cabinet : రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య, న్యాయ పట్టభద్రులతో పాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చేసినవారూ ఉన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్‌ చదివారు. జనసేన నుంచి మంత్రి అయిన కందుల దుర్గేష్‌కు కూడా ఇదే విద్యార్హత ఉంది. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్‌ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేశారు. నారా లోకేశ్‌ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్‌ బ్రిటన్‌లో ఎంబీఏ, కొండపల్లి శ్రీనివాస్‌ అమెరికాలో ఎంఎస్ చేశారు. నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్‌ ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్‌ చేశారు.

గొట్టిపాటి రవికుమార్‌ ఇంజినీరింగ్‌ చదివారు. డోలా బాల వీరాంజనేయస్వామి వైద్య విద్యను అభ్యసించారు. మండిపల్లి రాంప్రసాద రెడ్డి బీడీఎస్ చదువు మధ్యలో ఆపేశారు. నిమ్మల రామానాయుడు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డ, వాసంశెట్టి సుభాష్‌, కొల్లు రవీంద్ర న్యాయ విద్య పూర్తి చేశారు. కొండపల్లి శ్రీనివాస్‌ యూఎస్‌లో ఎంఎస్ చదవగా పి.నారాయణ, వంగలపూడి అనిత పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. సవిత, సంధ్యారాణి, బీసీ జనార్దనరెడ్డి, కొలుసు పార్థసారథి, అనగాని సత్య ప్రసాద్‌ డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేశారు. ఎన్‌ఎండీ ఫరూక్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.

చంద్రసేన క్యాబినెట్​లో యువ'గళం' - ప్రభుత్వానికి ఫ్రెష్‌ లుక్‌ తెచ్చేందుకు సాహసోపేత నిర్ణయం - 17 new faces in CM Chandrababu team

చంద్రబాబు టీం - కొత్త మంత్రుల వివరాలు - Andhra Pradesh Ministers details

మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్- సామాజిక న్యాయానికి పెద్దపీట - AP New Cabinet Ministers List

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.