EC Seized Money Liquor and Drugs in AP: ఎన్నికల కోడ్ అమలు నుంచి ఇప్పటి వరకూ 47.5 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వెండి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు మీనా తెలిపారు. వివిధ చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ 17.5 కోట్ల రూపాయల మేర నగదు స్వాధీనం అయినట్లు వెల్లడించారు. 5 లక్షల 13 వేల లీటర్ల మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
తనిఖీల్లో ఎన్నికల్లో పంచిపెట్టే ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. సీజర్లకు సంబంధించి 4337 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఉల్లంఘనలకు సంబంధించి 247 ఎఫ్ఐర్లు నమోదు అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 8 వేల 681 లైసెన్సుడు ఆయుధాలను ఆయా పోలీసు స్టేషన్లలో జమ చేశారని వివరించారు.
Mukesh Kumar Meena about Complaints: ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకు నేరుగా అందించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సచివాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందించొచ్చని వెల్లడించారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎన్నికల ఫిర్యాదులను నేరుగా అందించవచ్చని స్పష్టం చేశారు. పని దినాలతో పాటు సెలవు రోజుల్లోనూ సీఈఓ కార్యాలయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు చర్యలు చేపట్టాలి: ముఖేష్ కుమార్ మీనా - Postal Ballot Home Voting
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారన్నారు. జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులన్నీ వారికి వివరించినట్లు ఢిల్లీరావు పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు పరిశీలకులు ఈనెల 8న జిల్లాలో పర్యటిస్తారన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 2.6 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీరావు తెలిపారు. 2 కేజీల బంగారం, 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు.
సీ విజిల్ యాప్ ద్వారా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తమ దృష్టికి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మద్యంపై తక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. లిక్కర్ విషయంలో నాలుగు వందలకు పైగా కేసులు నమోదు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పష్టం చేశారు.
బెంజ్ సర్కిల్ వద్ద భారీ ఈవీఎం నమూనా: ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద భారీ ఈవీఎం నమూనాని అధికారులు ఏర్పాటు చేశారు. పార్టీ పేరు, గుర్తు, ఓటు వేసే విధానాన్ని వివరిస్తూ ఈ నమూనాను ఏర్పాటు చేశారు. ఓటు వేసిన తరువాత వచ్చే మాదిరి స్లిప్ మిషన్‌ని పక్కన ఏర్పాటు చేశారు. దీన్ని ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలందరూ వీక్షిస్తున్నారు. ఎన్నికల నిర్వాహణ అధికారులు ఇటువంటి నమూనాను ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లకు అవగాహన ఏర్పడుతుందన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా