ETV Bharat / state

పోలీస్​ నిఘాలో ఎన్నికల నిర్వహణ- పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం - Lok Sabha Elections 2024

Police Observers to Andhra Pradesh Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులను ఈసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్​లో నాలుగోదశలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఏప్రిల్ 25 తేదీ నుంచి మే 13 తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల పోలీసు అబ్జర్వర్లు పర్యటించనున్నారు. రెండేసి పార్లమెంటు నియోజకవర్గాల చొప్పున ఆ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను పోలీసు అబ్జర్వర్లను బాధ్యులుగా నియమిస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 5:03 PM IST

Police Observers to Andhra Pradesh Elections 2024

Police Observers to Andhra Pradesh Elections 2024 : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రానికి ఎన్నికల పోలీసు అబ్జర్వర్లను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వేలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షుడిగా నాగాలాండ్ కేడర్ చెందిన ఐపీఎస్ అధికారి నలీమ్ ముస్తఫాను ఈసీ నియమించింది.

యూపీ కేడర్​కు చెందిన సచీంద్ర పటేల్​ను శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి, ఆముదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీసు అబ్జర్వర్​గా యూపీ కేడర్​కు చెందిన సచీంద్ర పటేల్ ను నియమించారు. యూపీ కేడర్​కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్ కుమార్​కు విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పోలీసు అబ్జర్వర్​గా నియమించారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లోని శృంగవరపు కోట, భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ నియోజకవర్గాలతో పాటు గాజువాక, చోజడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావు పేట, నర్సీపట్నం నియోజకవర్గాలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.

కర్నాటక కేడర్​కు చెందిన టిపి శివకుమార్​ను కాకినాడ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు పర్యవేక్షకుడిగా నియమించారు. గుజరాత్ కేడర్​కు చెందిన ఐపీఎస్ అధికారి బలరామ్ మీనాను రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల పోలీసు అబ్జర్వర్​గా నియమించారు. ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఈసీ ఆదేశించింది.

ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్‌లకు, మరో ముగ్గురికీ ప్రభుత్వం పోస్టింగ్‌ - Postings to IAS Officers in AP

కర్నాటక కేడర్​కు చెందిన ఐపీఎస్ అధికారి టి. శ్రీధరాను ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు, ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను పర్యవేక్షించాలని ఈసీ సూచించింది. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి ప్రీతిందర్ సింగ్ ను విజయవాడ, గుంటూరు నియోజకవర్గాలకు, ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమిస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇక కర్ణాటకకు చెందిన కెప్టెన్ అయ్యప్పను నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాలకు ఆ పరిధిలోకి వచ్చే శాసనసభ నియోజకవర్గాల పోలీసు పర్యవేక్షకుడిగా నియమించారు.

ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల పోలీసు పర్యవేక్షకుడిగా మహారాష్ట్ర కేడర్​కు చెందిన అశోక్ టి. దూబే ను ఈసీ నియమించింది. ఆ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను కూడా దూబే పర్యవేక్షించనున్నారు. నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గాల పోలీసు పర్యవేక్షకుడిగా బీహార్ కేడర్​కు చెందిన హిమాన్షూ శంకర్ త్రివేదిని నియమించారు. అలాగే వీటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలనూ హిమాన్షూ పర్యవేక్షించనున్నారు.

బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త నియామకాలు - జాబితా విడుదల - EC appointed new Collectors and SPs
నాగాలాండ్ కేడర్​కు చెందిన ఐపీఎస్ అధికారిని ఇమ్నాలెన్సా ను అనంతపురం, హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలీసు పర్యవేక్షకురాలిగా నియమించారు. కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాలను బీహార్​కు కేడర్ ఐపీఎస్ అధికారి దిన్లావాజ్ అహ్మద్​ను పోలీసు అబ్జర్వర్​గా నియమిస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. ఈ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అహ్మద్ పర్యవేక్షించనున్నారు. ఇక తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పోలీసు అబ్జర్వర్​గా మహారాష్ట్ర కేడర్​కు చెందిన అరవింద్ సాల్వేను నియమించారు. ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా సాల్వే పర్యవేక్షించనున్నారు. ఎన్నికల పోలీసు పర్యవేక్షకులంతా ఏప్రిల్ 25 తేదీ నుంచి 13 మే వరకూ ఏపీలో విధులు నిర్వహించనున్నారు.

వేటు పడిన అధికారుల స్థానంలో ఇంఛార్జులుగా జేసీలు, అదనపు ఎస్పీలు - collectors and SPs panel names

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.