ETV Bharat / state

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 11న నోటిఫికేషన్ - ఎన్నిక ఎప్పుడంటే!

ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం - 2023 డిసెంబర్‌ 15న షేక్ సాబ్జీ మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం

East West Godavari District Teacher MLC bye Election Notification
East West Godavari District Teacher MLC bye Election Notification (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 5:21 PM IST

East West Godavari District Teacher MLC bye Election Notification : రాష్ట్రంలో తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.

నవంబర్‌ 18వరకు నామినేషన్లు స్వీకరించి, 19వ తేదీన నామినేషన్లను పరిశీలన చేపడతారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్‌ 21గా ఈసీ వెల్లడించింది. డిసెంబర్‌ 5 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం డిసెంబర్‌ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఈసీ ప్రకటనలో వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.