ETV Bharat / state

ఏపీలో 54 కరవు ప్రభావిత మండలాలు ఇవే - జాబితా విడుదల - DROUGHT MANDALS DECLARED

54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ ఉత్తర్వులు - నైరుతి రుతుపవనాల సీజన్‌లో 5 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్న ప్రభుత్వం

Drought_Mandals_Declared
Drought Mandals Declared (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 9:42 PM IST

Drought Mandals Declared: 2024 ఖరీఫ్ సీజన్​కు సంబంధించి కరవు మండలాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవు బారిన పడినట్టు వెల్లడించింది. మిగతా 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్టుగా నివేదికలు వచ్చాయని స్పష్టం చేసింది. ఐదు జిల్లాల్లోని 54 కరవు మండలాల్లో 27 చోట్ల తీవ్ర కరవు పరిస్థితులు, మరో 27 మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నట్టు తెలియచేసింది. ఈ కరవు మండలాలను నోటిఫై చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.