Drone Corporation Secretary on Drone Program: ఆంధ్రప్రదేశ్‌ను "డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా"గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందుకే రెండు రోజుల పాటుస డ్రోన్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. డ్రోన్ కార్పొరేషన్ అధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రోన్ ముసాయిదా విధానాన్ని ఆవిష్కరించి సమ్మిట్‌లో పాల్గొనేవారితో పంచుకుంటామని చెప్పారు. ఒప్పందాల కోసం చాలా సంస్థలు ముందుకొస్తున్నా పూర్తిస్థాయి పాలసీ సిద్ధమయ్యాకే ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్‌లో 5వేల 500 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సురేష్ కుమార్ చెప్పారు. హ్యాకథాన్ విజేతలకు అక్కడే సీఎం చేతులమీదుగా బహుమతుల ప్రదానం చేస్తామని సురేష్ కుమార్ తెలిపారు. అంతే కాకుండా డ్రోన్ కాన్ఫరెన్స్‌లో రెండు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సురేశ్‌కుమార్ తెలిపారు. డ్రోన్ ఎకో సిస్టమ్ కోసం స్ట్రాటజీ ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్ పేపర్ విడుదల చేస్తామని ఆ పేరర్ను డ్రోన్ కాన్ఫరెన్స్‌కు వచ్చే వారికి అందజేస్తామని తెలిపారు. సలహాలు స్వీకరించి నెల వ్యవధిలో డ్రోన్ పాలసీ తీసుకువస్తామని వెల్లడించారు.
ఇసుక రవాణా వివాదాలు - గ్రామాల మధ్య కొట్లాటలు, గొడవలు
రేపు డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం జరుగుతుందని కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో కృష్ణా నది పక్కనే డ్రోన్ల షో ఉంటుందని తెలిపారు. రేపు 5,500 డ్రోన్లతో షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. రేపు సాయంత్రం 6.30 నుంచి రా.8.30 వరకు డ్రోన్ల షో ఉంటుందని అన్నారు. విజయవాడలో డ్రోన్ల షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని వెల్లడించారు. హ్యాకథాన్ విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని అన్నారు. డ్రోన్ల షోతో పాటు లేజర్ షో, బాణసంచా మిరుమిట్లు, డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ ప్రజెంటేషన్ కూడా ఉంటుందని తెలిపారు.
డ్రోన్ కాన్ఫరెన్స్‌లో రెండు ఒప్పందాలపై సంతకాలు చేశాం. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా జరుగుతుంది. డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ సర్టిఫైడ్ ఏజెన్సీగా నిలుస్తుంది. డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ పైలట్ శిక్షణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. తిరుపతి ఐఐటీతో నాలెడ్జ్ పార్ట్‌నర్‌షిప్ ఎంవోయూ జరుగుతుంది. ఎంవోయూ కోసం చాలా కంపెనీల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు అధ్యయనం చేసి పాలసీ ప్రకారం ఎంవోయూ చేస్తాము.- సురేష్ కుమార్, డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి
గుర్లలో పవన్ కల్యాణ్ పర్యటన - మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం
దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది: సీఎం చంద్రబాబు