ETV Bharat / state

గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కడప నగర వాసులు - సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళన - Drinking Water Problem - DRINKING WATER PROBLEM

Drinking Water Problem in YSR District : కడప నగరం నీటి ఎద్దడితో అల్లాడుతోంది. తాగునీటి సమస్యను తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నగర వాసులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని కాలనీల్లో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

water_problem
water_problem
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 12:36 PM IST

Drinking Water Problem in YSR District : సీఎం సొంత జిల్లా ప్రజలు తాగునీటి సౌకర్యం లేక అల్లడిపోతున్నారు. వేసవి ఆరంభంలోనే కడప నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అధికారుల వైఫల్యం వల్లనే నీటి సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని నగర వాసులు వాపోతున్నారు. ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేసిన ఏ మాత్రం సరిపోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిదు రోజులకు ఒకసారి నీరు రావడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

YSR District : కడప నగరంలో సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. కడప నగరానికి నీటి సరఫరా పెన్నా నది సమీపం నుంచి పైపుల ద్వారా ప్రజలకు నీరు అందుతుంది. వేసవికాలం వస్తే చాలు పెన్నా నదిలో నీరు ఇంకిపోయి నీటి సరఫరా ఆగిపోతుందని స్థానికులు వాపోతున్నారు.

గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కడప నగర వాసులు - సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళన

వాంబే కాలనీ వాసుల వ్యధ - ఈ నీరు తాగేదెలా? - Drinking Water Problem

People Suffer Water Problem : ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్చి​ నుంచే కడప నగర ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. విపరీతమైన ఎండలతో బావులు సైతం అడుగంటాయని నగర వాసులు వాపోతున్నారు. బావులు ఎండిపోవడం వల్ల అయిదు రోజులకు ఒకసారి నీరు రావడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.

నగరపాలక అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదు. నీళ్ల కోసం రాత్రింబవళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఏకంగా ఉద్యోగాలకు సెలవులు పెట్టి నీళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. మరికొందరు ఒక్క నీటి ట్యాంకర్​కు రూ.400 నుంచి రూ.600 వెచ్చించిస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజానీకం పరిస్థితి మాటల్లో చెప్పాలేని పరిస్థితి ఏర్పడింది. వారు ఎంత సేపు నీటి కొళాయి నీటి కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితి.

కడప జిల్లాలో జలయజ్ఞం ఇదేనా! గుక్కెడు తాగు నీటి కోసం నరకయాతన - Huge Water Problem In Ysr District

Water Problem : సీఎం సొంత జిల్లాలో కూడా నీటి కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నీటి సరఫరా చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి ఆరంభంలోనే నీళ్ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కొవాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.