ETV Bharat / state

రాష్ట్రంలో పెరిగిన ఓటర్లు - ఆ సంఖ్య ఎంతంటే?

ముసాయిదా విడుదల చేసిన ఎన్నికల సంఘం

Voters in AP
Voters in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

AP Voters : ఆంధ్రప్రదేశ్​లో సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే 19,048 మంది ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. అందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803 మంది. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ముసాయిదా జాబితాను విడుదల చేసింది.

నవంబర్ 28 వరకూ ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనుంది. 2025 జనవరి 6న తుది జాబితా ప్రచురించనుంది. ఇందులో భాగంగా నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్‌ డేలు ఏర్పాటు చేయనుంది. ఆయా తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాతో సహా బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం అర్జీ చేసుకునేందుకు వీలుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు.

ముసాయిదా జాబితా ప్రకారం

  • సాధారణ ఓటర్లు : 4,13,53,792
  • సర్వీసు ఓటర్లు : 67,143
  • మొత్తం ఓటర్లు : 4,14,20,935 (పురుషులు: 2,03,47,738, మహిళలు: 2,10,69,803 థర్డ్‌ జెండర్‌ 3,394)

4 లక్షలకుపైగా యువ ఓటర్లు

18-19 ఏళ్ల వయోవర్గానికి చెందినవారు : 4,86,226

6,13,970 మంది ఓటర్ల పెరుగుదల

  • 2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ చేరిన నూతన ఓటర్లు : 10,82,841 మంది.
  • 2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ జాబితాలో నుంచి తొలగించిన ఓటర్లు : 4,68,871
  • 2024 జనవరిలో విడుదల చేసిన తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నికర పెరుగుదల : 6,13,970 మంది.
  • దివ్యాంగ ఓటర్లు : 5,18,801
  • రాష్ట్రంలోని మొత్తం పోలింగ్‌ కేంద్రాలు : 46,397
  • ఓటరు జనాభా నిష్పత్తి : ప్రతి 1000 మంది జనాభాకు 720 మంది ఓటర్లు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు ఖరారు - ఇద్దరి పేర్లు ప్రకటించిన అధిష్ఠానం

2029లోనూ గెలుపే లక్ష్యం - టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.