Disappearing of Ponduru Khadi Clothes: పొందూరు ఖద్దర్ ఇది హుందాతనానికి ప్రతీక. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందర్నీమెప్పించే చేనేత వస్త్రం. ఘనకీర్తి గడించిన పొందూరు ఖాదీ ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. చేనేతకు ప్రజాదరణ కరవై, ప్రభుత్వం నుంచి చేయూతలేక నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నేటితరం ఎవరూ ఈ వృత్తిలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
పెంచిన విద్యుత్ ధరలతో జీవనం అస్తవ్యస్తం! కూలీ రేట్లు పెంచాలని చేనేత కార్మికులు ఆందోళన
పొందూరు ఖద్దర్ చరిత్ర: శ్రీకాకుళం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పొందూరు ఖద్దర్. గాంధీజీ నుంచి ప్రస్తుత రాజకీయ నేతల వరకు అందరూ ఈ ఖాదీకి అభిమానులే. పొందూరు ఖాదీ పరిశ్రమ 1949లో సంఘటిత రంగంలో అడుగుపెట్టింది, అదే ఏడాది ఏప్రిల్ 1న ఆంధ్ర ఫైన్ ఖాదీ సంఘంగా అవతరించింది, అప్పటి నుంచి ఆంధ్ర సన్నఖాదీ విశిష్టత దశదిశల విస్తరించింది. 1955లో సొంత భవనం నిర్మించి ఖాదీ కార్యకలాపాలు సాగించారు. ప్రస్తుతం ఈ పరిశ్రమపై 1000 మంది స్పిన్నర్స్, 100 మంది వీవర్స్ ఆధారపడి పని చేస్తుంటే 6 కోట్ల రూపాయలు లావాదేవీలు సాగిస్తోంది.
ఆసక్తి చూపని యువత: ఖాదీ వస్త్రాలకు ప్రజాదరణ తగ్గుతుండటం, ముడి సరుకులు ధరల పెరుగుదలతో నేతన్నల ఉపాధిపై దెబ్బ పడింది. ఒకప్పుడు 500కు పైగా చేనేత కుటుంబాలు ఉంటే ప్రస్తుతం 50 కుటుంబాలు మాత్రమే వృత్తిని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నవారు కూడా 50ఏళ్లకు పైబడిన వారే. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కాడించినా జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడట్లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Handloom Weavers Problems ప్రభుత్వాలు మారుతున్న.. మారని చేనే'తలరాత'లు
వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖాదీ కార్మికులు మాత్రం చీకటి మాటునే మగ్గిపోతున్నారు. పొందూరు యువత ఖాదీ తయారీలో పాలుపంచుకోవడానికి నిరాకరిస్తుండగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నవారు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు.
"ఈ పని నమ్ముకునే జీవిస్తున్నాం. ఆరు గంటలు పనిచేస్తున్నా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండడం లేదు. సంవత్సరానికి చేనేత నేస్తం పథకం ద్వారా డబ్బులు ఇవ్వటమే తప్ప నేతన్న కష్టాలు ఆదుకోవటం లేదు " -చేనేత కార్మికులు
మగ్గానికి మహర్దశ తెస్తామని 2019 ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికారంలోకి రాగానే నేతన్నల వెన్నువిరిచారు. కష్టానికి తగిన ప్రతిఫలంలేక నేతన్నల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా అధికార ప్రభుత్వం కనికరించలేదు. చివరికి కుటుంబ పోషణ కష్టమై వారు కూలీ పనుల బాట పట్టినా మిన్నకున్నారు. ఎన్నికల ముందు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చిన ఆ మాటే లేదు. ఆఖరుకు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే వారికి కొత్తగా పింఛన్ మంజూరు చేసేందుకూ నిబంధనలు పెట్టి ఫించన్ దక్కకుండా చేశారు. పదేపదే 'నా బీసీ, నా బీసీ' లంటూ గుండెలు బాదుకునే జగన్ వెనకబడిన వర్గాలైన చేనేతలతో వ్యవహరించిన తీరిదీ. సొంత మగ్గాలున్న వారికి ఏడాదికి ఒకసారి నేతన్న నేస్తమంటూ బటన్ నొక్కడమే తప్ప వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడంగానీ, వాటిని పరిష్కరించేందుకు ముందడుగు వేసిన సందర్భంగానీ లేవు.
జగన్ ప్రభుత్వం వచ్చాక.. చేనేత కార్మికులకు అందని ద్రాక్షాలా మారిన రాయితీలు