ETV Bharat / state

తుమ్మలగుంటలో ఎమ్మెల్యే అరాచకాలు - పేదల ఇళ్లు తొలగింపు - జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చివేత

Demolition of Poor People Constructions In Tirupati : అధికారం అండతో పేద ప్రజలను వైస్సార్సీపీ ప్రభుత్వం పెట్టని కష్టం లేదు. వైఎస్సార్సీపీ నేతల వల్ల రాష్ట్రం నలుమూలలా ప్రతీ ఒక్కరు ఏదో ఒక విధంగా ప్రజలను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులు మఠం భూముల్లో కేవలం పేదల ఇళ్లు మాత్రమే కూలగొట్టి అధికారం అధికార అహంకారంతో వారికి నీడ లేకుండా చేశారని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.

demolition_of_poor_people_constructions_in_tirupati-20918939_thumbnail_16x9_demolition_of_poor_people_constructions_in_tirupati

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 8:04 PM IST

జేసీబీలతో ఇళ్లు కూల్చివేత- పేదలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి కబ్జాల ప్రతాపం

Demolition of Poor People Constructions in Tirupati : అధికారం అండతో పేద ప్రజలను వైస్సార్సీపీ ప్రభుత్వం పెట్టని కష్టం లేదు. రాష్ట్రం నలుమూలలా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అధికార పార్టీ నేతల ఆగడాలకు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లే అధికం. ప్రజా ప్రతినిధులే మా పాలిట కష్టాలుగా మారి సమస్యలు తెచ్చిపెడుతుంటే మా బాధలు ఎవరి చెప్పుకోవాలని బాధిత ప్రజలు వాపోతున్నారు. తిరుపతి జిల్లా (Tirupati District) తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆగడాలకు పేదలు రోడ్డున పడ్డారు.

గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు - అండగా ఉంటానని పట్టించుకోని సీఎం జగన్​

Poor People House Demolished By MLA Chevireddy Followers : తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో ఆక్రమణలు తొలగింపు పేరుతో పోలీసులు జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేశారని చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్ పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మఠం భూముల్లో కేవలం పేదల ఇళ్లు మాత్రమే ఎందుకు కూల్చివేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆక్రమణలోని మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని జనసేన నాయకుడు (Janasena Leader) మనోహర్ డిమాండ్ చేశారు.

ధర్మవరంలో ఉద్రిక్తత - నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చేందుకు సిద్దమైన అధికారులు, అడ్డుకున్న పరిటాల ‍శ్రీరామ్‌

High Tension at MLA Cheivreddy's Native : ఈ దారుణం పై స్పందిస్తూ బాధితులకు మద్ధతు తెలుపుతూ టీడీపీ, జనసేన నేతలు అధికార పార్టీని వీరికి న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైఎస్సార్సీపీ నేతలు అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలను (TDP Leaders) గృహ నిర్బంధం చేసి అర్ధరాత్రి దొంగల్లా వెళ్లి జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేస్తారా? అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భూకబ్జా రెడ్డిగా మారిపోయారని దుయ్యబట్టారు.

'హాథీరాంజీ మఠం స్థలంలో 30 ఎకరాలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించారు. పేదవారి స్థలం దోచుకున్నారు. వారు కొన్నామని చెప్పుకుంటున్నారు. పేదల స్థలాలు లాక్కునేందుకే ఎమ్మెల్యే ఈ దారుణానికి ఒడిగట్టారు. పేదల ఇళ్లు కూల్చిన అధికారులకు ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బంధువుల ఇళ్లు కనపడలేదా? వాటిని ఎందుకు కూల్చలేదు? నిజంగా భూమి మీది అయితే పేపర్లు చూపించండి. ఉన్నోళ్ల జోలికి పోకుండా ఇలా పేదవాళ్ల ఇళ్లు ఎలా కూలగొడతారు. కూల్చిన ఇళ్లను వారం రోజుల్లో తిరిగి నిర్మించి పేదలకే ఇవ్వాలి' -పులివర్తి సుధారెడ్డి, టీడీపీ నాయకురాలు, మనోహర్​, జనసేన నాయకుడు

'చెట్లు తొలగింపు సాకుతో ఇళ్లు కూల్చేస్తున్నారు' : విజయవాడలో ప్రజల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.