ETV Bharat / state

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు - పలువురు కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు - AMIT SHAHFake VIDEO CASE - AMIT SHAHFAKE VIDEO CASE

Delhi Police Notices to Congress Leaders on Amit Shah Video : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియా మార్ఫింగ్‌ కేసులో దిల్లీ పోలీసులు, హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ మేరకు విచారణ చేపట్టారు. దిల్లీ పోలీసుల నోటీసులపై వివరణ ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.

delhi_police_summons_to_cm_revanth_on_amit_shah_fake_video

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 4:49 PM IST

Updated : Apr 29, 2024, 7:03 PM IST

Delhi Police Summons to Congress Leaders on Amit Shah Fake Video : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు​, సోషల్‌ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్‌, పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్‌, ఆ పార్టీకి చెందిన నవీన్‌, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారని దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నోటీసులపై వివరణ ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని ఫేక్ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమిత్‌ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

Last Updated : Apr 29, 2024, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.