ETV Bharat / state

'సార్ కాస్తా మా బాధను అర్ధం చేసుకోండి' - ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన - Delay in MBBS Counseling AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 8:06 AM IST

AP MBBS Counseling 2024 : రాష్ట్రంలో ఎంబీబీఎస్​ కౌన్సిలింగ్‌ తీవ్ర జాప్యమవుతోంది. ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. ఫలితంగా ఆల్‌ ఇండియా కోటా సీట్లు కోల్పోతున్నామని అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన మొదటి విడత సీట్ల కేటాయింపు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Delay in MBBS Counseling AP
Delay in MBBS Counseling AP (ETV Bharat)

Delay in MBBS Counseling AP : ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆల్‌ ఇండియా కోటా సీట్లకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ, సీట్ల కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత కౌన్సిలింగ్​కు ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రకటన ఇచ్చారు. ఈనెల 17లోగా రెండో విడతకు ఆప్షన్లు నమోదుకు గడువు ఉంది. అయినా ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కూడా ఇప్పటివరకూ పూర్తి చేయలేదు.

జాతీయ వైద్య కమిషన్‌-ఎన్​ఎంసీ ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచే తరగతులు ప్రారంభించాలి. ఈలోగా మొదటి, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ విద్యార్థులకు రాష్ట్రంలో మెరుగైన కళాశాలల్లో సీటు దక్కపోతే ఆల్‌ ఇండియా కోటాలో సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జాప్యం జరగడం, ఆల్‌ ఇండియా కోటా భర్తీ ముందంజలో ఉండడంతో రాష్ట్ర విద్యార్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

న్యాయ వివాదాలు ప్రకృతి విపత్తులు : ఆంధ్రప్రదేశ్​లోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 9న ప్రకటన ఇచ్చింది. 35 వైద్య కళాశాలల్లో 3,856 కన్వీనర్‌ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికోసం 14,000ల మంది విద్యార్థులు అర్జీ చేసుకున్నారు. తర్వాత వివిధ కారణాలతో ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది.

MBBS seats in AP 2024 : రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీ సీట్లకు సంబంధించి న్యాయస్థానంలో కేసు వేయడం, విజయవాడలో భారీ వర్షాల వల్ల నాలుగు రోజులు విశ్వవిద్యాలయం మూతపడింది. దీనికి తోడూ ప్రకృతి విపత్తుల వల్ల విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు కోస్తా ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తడంతో దరఖాస్తుల నమోదుకూ సమస్యలొచ్చాయి. దీంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైంది.

తుది ప్రాధాన్య జాబితా విడుదల : మరోవైపు ప్రవేశాలకు సంబంధించి 13,849 మంది అభ్యర్థులతో కూడిన తుది ప్రాధాన్య క్రమ జాబితాను యూనివర్సిటీ సెప్టెంబర్‌ 12న విడుదల చేసింది. సీట్ల కేటాయింపునకు ఈనెల 17 వరకు సమయం పట్టే అవకాశముందని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సమయం మించిపోతుండడంతో మొదటి విడత పూర్తి కాకుండానే, రెండో విడత ప్రవేశాలను సెప్టెంబర్‌ 27న చేపడతామంటూ తాజాగా ప్రకటించారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ కూడా పూర్తిచేసి అక్టోబర్ 1నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రులు రాలేదు : మాగుంట - mp magunta speech in loksabha

మాట మార్చిన అధికారులు - అయోమయంలో వైద్య విద్యార్థులు - Foreign Medical Students problems

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.