Darakonda Daralamma Temple in Alluri District : అల్లూరి జిల్లా పర్జల ప్రత్యక్ష దేవత దారాలమ్మ. ఓ వైపు దారకొండ జలపాతం. మరో వైపు శక్తి స్వరూపిణిగా పూజలందుకునే దారాలమ్మ తల్లి ఆలయం ఉంటాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, సీనియర్ ఎన్టీఆర్ కొలిచిన దేవతగా ప్రాశస్త్యం పొందిన దారాలమ్మ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏజెన్సీ వాసుల ప్రత్యక్ష దేవత : దారకొండలోని దారాలమ్మను చుట్టుపక్కల గూడెం ప్రజలు వనదేవతగా ఆరాధిస్తారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అమ్మవారికి పూజలు చేసి, ఆమె అనుగ్రహంతోనే బ్రిటిష్ వారిపై పోరాడి అనేక విజయాలు సాధించారని స్థానికులు చెబుతుంటారు. విశాఖ నుంచి భద్రాచలం వెళ్లేదారిలో చింతపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరాన దారకొండ జలపాతం సమీపంలో దారాలమ్మ ఆలయం ఉంది. 1964లో కల్కిమూర్తి అనే భక్తుడు అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. రాంలాల్ అనే భక్తుడు అమ్మవారి ఆలయం నిర్మించారు. అప్పట్నుంచి దారాలమ్మను గిరిజనులు, ఇతర భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటున్నారు. దారకొండలో ఏటా కొత్త అమావాస్య, ఉగాది రోజు ఘనంగా జాతర నిర్వహిస్తారు.
సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!
అమ్మవారిని దర్శించుకున్న ఎన్టీఆర్ : నటసార్వభౌముడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు "డ్రైవర్ రాముడు" షూటింగ్ జరిగినప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. అప్పటినుంచి నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారిని దర్శించుకుంటారు. నందమూరి బాలకృష్ణ విరాళంతో అమ్మవారి ఆలయానికి రెండు గదులు నిర్మించినట్లు ఆలయ పూజారి తెలిపారు.
చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu
కోరిన కోర్కెలు తీర్చే పద్మనాభ ద్వాదశి వ్రతకథ- చదివినా/విన్నా సమస్త కష్టాలు తొలగిపోతాయ్!