ETV Bharat / state

మత్స్యకారుల బోటులో పేలిన సిలిండర్​ - ఐదుగురికి తీవ్రగాయాలు - cylinder blast in boat - CYLINDER BLAST IN BOAT

Cylinder Blast in Boat at Visakha : విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటులో సిలిండర్ పేలి తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కోస్ట్​గార్డ్ సిబ్బంది హుటాహుటన ఘటన స్థాలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.

Cylinder_Blast_in_Boat_at_Visakha
Cylinder_Blast_in_Boat_at_Visakha
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 9:14 PM IST

Updated : Apr 5, 2024, 10:59 PM IST

Cylinder Blast in Boat at Visakha : విశాఖపట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటులో సిలిండర్ పేలి తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, మరో నలుగురికి స్పల్ప గాయాలయ్యాయి. విశాఖ తీరం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కోస్ట్​గార్డ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జాలర్లను మరో నౌకలో డాక్‌యార్డుకు తరలిస్తున్నారు. అదేవిధంగా బాధితులను కేజీహెచ్‌కు తరలించేందుకు నౌకాదళం తగిన ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈరోజు సాయంత్రం కాకినాడ తీరానికి చెందిన కొంతమంది మత్స్యకారులు భవాని అనే బోటు మీద సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్న సమయంలో అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలి బోటులోని 9 మంది గాయాల పాలయ్యారు.

ప్రమాదం లో గాయ పడిన వారి వివరాలు :

1.దండుపల్లి శ్రీను

2.ఎం భైరవ

3.గంగాద్రి

4.డి వీరబాబు

5.ఆర్ సత్తిబాబు

6.నాయేటి వజ్రం

7.ఏస్ సత్తిబాబు

8.ధర్మారావు వయసు

9.వై సత్తిబాబు వయసు

Last Updated : Apr 5, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.