ETV Bharat / state

దానా ఎఫెక్ట్​ - ఆ రాష్ట్రంలో 100 విమాన సర్వీసుల రద్దు - CYCLONE DANA EFFECT

తీరం దాటిన తుపాను - మూడు రాష్ట్రాల్లో భారీవర్షాలు

CYCLONE_DANA_EFFECT
CYCLONE_DANA_EFFECT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 9:43 AM IST

Cyclone Dana Effect in Three States : బంగాళాఖాతంలో ‘దానా’ తీవ్ర తుపానుగా బలపడింది. గురువారం (అక్టోబర్​ 24న) సాయంత్రం 5.30 సమయంలో పరదీప్‌ (odisha) నుంచి 100 కిలోమీటర్లు, ధమ్రా (ఒడిశా) నుంచి 130 కిలోమీటర్లు, సాగర్‌ ద్వీపం (West Bengal) నుంచి 210 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తీరం దాటిన 'దానా' తీవ్ర తుపాను

ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా మధ్య 'దానా' తుపాన్​ తీరం దాటింది. అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 మధ్యలో తుపాను తీరం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలో మీటర్ల వేగంతో బీకర గాలులు వీచాయి. ఒడిశాలోని భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్, కేంద్రపరాలో భారీ వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. తుపాను దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాల్‌లోనూ 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దూసుకొస్తున్న దానా - ఏపీకి భారీ అలర్ట్

ఉత్తరాంధ్ర జిల్లాలపై దానా తుపాను (Dana Cyclone) ప్రభావం లేకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం (అక్టోబర్​ 24న) రాత్రి 9 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా వర్షాలు కురవలేదు. రాబోయే 3 రోజుల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు శనివారం (అక్టోబర్​ 26న) వరకు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Organization) ఎండీ రోణంకి కూర్మనాథ్‌ హెచ్చరించారు.

ఒడిశాలో నాలుగు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ : ‘దానా’ తుపాను ధాటికి ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాలేశ్వర్, భద్రక్, కేంద్రపడ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ (Red Alert) జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 10 లక్షల మందిని తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఒడిశా సీఎం మోహన్‌చరణ్‌ మాఝీ తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ఒడిశా ముఖ్యమంత్రికి ఫోను చేసి రాష్ట్రంలో తుపాను సన్నద్ధతపై ఆరా తీశారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలను శుక్రవారం ( అక్టోబర్​ 25న) ఉదయం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో 100 సంఖ్యలో విమాన సర్వీసులపై ప్రభావం పడింది.

దానా తుపాన్​ ఎఫెక్ట్‌ - 200కు పైగా రైళ్లు రద్దు - పలు పరీక్షలు వాయిదా!

భారీ వర్షాలతో ఈదురుగాలులు : దక్షిణ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలతో ఈదురుగాలులు వీచాయి. రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని 3.5 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. తాను రాత్రంతా రాష్ట్ర సచివాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలియజేశారు. తుపాను దృష్ట్యా తూర్పు, ఆగ్నేయ రైల్వే విభాగాలు 27వ తేదీ (ఆదివారం) వరకు దాదాపు 400 రైలు సర్వీసులను రద్దు చేశాయి. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కొల్హాన్‌ ప్రాంతానికి శుక్రవారం ఆరెంజ్‌ ఎలర్ట్‌(Orange Alert) జారీ చేశారు. వర్షాలతో పాటు పిడుగుపాట్లు, గంటకు 60 కిలోమీటర్లు వేగంతో తీవ్రగాలులు విస్తాయని అధికారులు తెలిపారు.

అలర్ట్​ - 23-25 తేదీల్లో ట్రైన్​ టికెట్​ బుక్​ చేసుకున్నారా? కొన్ని సర్వీసులు రద్దు - చెక్​ చేసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.