ETV Bharat / state

వీడియో కాల్ వస్తే అలా చేయండి - ఫ్రంట్ కెమెరా మూసిన తర్వాతే లిఫ్ట్ చేయండి

వాట్సాప్​ వీడియో కాల్​ లిఫ్ట్​ చేస్తే అవతలి వారి ఉచ్చులో చిక్కుకున్నట్లే!

CYBER_CRIMINALS_WHATS_APP_CALL
CYBER_CRIMINALS_WHATS_APP_CALL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 1:42 PM IST

Cyber Criminals Cheating What App Groups : అనుకోకుండా వాట్సప్‌ నుంచి వీడియో కాల్‌ వస్తుంది. ఎవరైన తెలిసిన కాల్‌ ఏమో అని ఎత్తామా ఇక అంతే సంగతులు. అవతల అందమైన స్త్రీ నగ్నంగా మాట్లాడుతుంది. ఇటుపక్క ఆమె, అటుపక్క బాధితుడు స్క్రీన్‌ మీద కనిపిస్తున్న వీడియోని రికార్డు చేస్తారు. ఇక సైబర్​ నేరగాళ్లు బెదిరింపులు మొదలుపెడతారు. నగ్న వీడియోను కుటుంబ సభ్యులకు పంపుతామని, తెలిసిన వారుండే గ్రూపుల్లో పెడతామని బాధితుడిని బెదిరించి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లు ఈ కొత్త తరహా దోపిడీకి తెర లేపారు. పోలీసులు ఒక పక్క అవగాహన కల్పిస్తుంటే కొత్త విధానాలతో నేరగాళ్లు తెగబడుతున్నారు. ఇలాంటి కొత్త రకం సైబర్​ నేరాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి.

లింకులు క్లిక్‌ చేస్తే ఊడ్చేస్తారు! : ఉచిత డేటా, ఐఫోన్‌ అంటూ ఊరించే సందేశాలు ఇప్పుడు సర్వ సాధారణం అయ్యాయి. ఇలాంటి సందేశాలతో ఏ మాత్రం ఆశపడి క్లిక్‌ చేసినా బ్యాంకులో దాచుకున్న సొమ్మునంతా ఊడ్చేస్తారు. ఎవరూ ఏదీ ఉచితంగా ఇవ్వరనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రజల మానసిక బలహీనతలు సైబర్‌ నేరగాళ్లు ఆసరాగా చేసుకోని దోపిడి పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ ఉద్యోగం, ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.లక్షకు పైగా సంపాదించవచ్చు, కొన్ని రోజుల వ్యవధిలో పెట్టుబడి రెట్టింపవుతుంది వంటి ప్రకటనలతో ప్రజలను ఊరిస్తున్నారు. ఇటువంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మీకూ ఇలాంటి ​కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!

మోసాలు : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ ఏడాది జులై చివరి నాటికి 292 ఫిర్యాదులు అందాయని సైబర్​ పోలీస్​ అధికారులు వెల్లడించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా బాధితులు 1.41 కోట్లు రూపాయలు పోగొట్టుకున్నారని తెలియజేశారు. వీరి ఫిర్యాదుల ఆధారంగా స్పందించిన సైబర్‌ నేర విభాగం పోలీసులు 25 లక్షల రూపాయలను సైబర్​ నేరగాళ్లుకు చేరకుండా బ్యాంక్‌లో హోల్డ్‌లో పెట్టించగలిగారు.

తెలియని నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వస్తే లిఫ్ట్‌ చేయవద్దు. ఒక వేళ కాల్​ ఎత్తాల్సి వస్తే ఫ్రంట్‌ కెమెరాను వేలితో మూసి లిఫ్ట్‌ చేయాలి. దీంతో మనం స్క్రీన్‌లో కనిపించం. వాళ్లు రికార్డు చేసే అవకాశం ఉండదు. బాధితులు ఎవరైనా మోసపోతే గంట వ్యవధిలో 1930కి కాల్‌ చేసి వివరాలు చెప్పాలి - డీఎస్పీ ఫణీందర్, సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్, ఖమ్మం

బీ కేర్​ఫుల్ గురూ - మత్తుగా మాటల్లోకి దించుతారు - నిలువునా దోచేస్తారు!

ఇవిగో ఉదాహరణలు :

  • అధిక లాభాలు వస్తాయన్న ఫేస్​బుక్​ ప్రకటన నమ్మి ఖమ్మం జిల్లాకు చెందిన పాండురంగాపురానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు స్టాక్​ మార్కెట్లో 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కొద్ది రోజుకే తాను మోసపోయానని గుర్తించి ఆగస్టు 13న సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు.
  • స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పేరుతో వచ్చిన లింకును క్లిక్‌ చేయటంతో పాటు వివరాలు నమోదు చేసిన ఖమ్మం నగరంలోని మధురానగర్‌లో నివసించే మరో ఉపాధ్యాయుడు 73 వేల రూపాయలు పోగొట్టుకున్నారు. దీంతో గత నెల 24 వ తేదిన (సెప్టెంబరు 24న) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • తల్లాడలో అక్టోబరు 18న అర్ధరాత్రి ఇద్దరు నాయకులకు వాట్సప్‌ న్యూడ్‌ కాల్స్‌ వచ్చాయన్న వార్త తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం సృష్టించింది.
  • ఖమ్మంలో కొంత మంది ప్రముఖులు అక్టోబరు నెలల్లో ఇటువంటి కాల్స్‌ను ఎదుర్కొన్నారు.
  • వైరాకు చెందిన ఓ వ్యక్తికి ఇటువంటి కాల్‌ చేసి వీడియో రికార్డు చేసిన సైబర్​ నేరగాళ్లు దాన్ని ఆయనకు పంపించి నగదు చెల్లించాలంటూ బెదిరించారు. దీంతో ఆయన సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు.

"ఆ స్టాక్​లో కళ్లు చెదిరే లాభాలు" - ఏడు బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లు - ఏమైందంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.