ETV Bharat / state

అధికారులూ పారాహుషార్- మీ ఫొటో ముందుపెట్టి అడ్డంగా దోచేస్తున్న సైబర్​ నేరగాళ్లు - FAKE DP CYBER CRIME

Cyber Crime with Government Officers Fake Whatsapp DP: ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారుల ఫొటోలతో నకిలీ డీపీలు, నకిలీ వాట్సప్ అకౌంట్స్​లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెగబడుతున్నారు. పలు శాఖల ఉన్నతాధికారుల ఫొటోలతో వాట్సప్ ఖాతాలు తెరిచి కిందిస్థాయి ఉద్యోగులకు మెస్సేజ్ చేస్తున్నారు. ఐ యామ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జంట్ఐ విల్ గివ్ లేటర్ అని మెస్సేజ్ పంపి అందిన కాడికి దోచుకుంటున్నారు.

Cyber Crime with Government Officer Fake Whatsapp DP
Cyber Crime with Government Officer Fake Whatsapp DP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 7:13 AM IST

Cyber Crime with Government Officers Fake Whatsapp DP : సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో దోపిడీకి పథకాలు వేస్తున్నారు. అంతర్జాలంలో దొరికిన సమాచారంతో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. వాట్సప్,ఫేస్ బుక్ ఖాతాల్లో తమ ఐడెంటిని తెలిపేందుకు ఫొటోలు డీపీలుగా ఉంచుతారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ క్రిమినల్స్ నయా దందా షురూ చేశారు.

సైబర్‌ దొంగలున్నారు జాగ్రత్త సుమీ - ప్రముఖుల బోగస్‌ ఇంటర్వ్యూలు, వీడియోలతో బురిడీ - Cyber ​​Crimes Increasing in ap

హాయ్ ఐ యామ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జంట్ : ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉన్నతాధికారుల పేర్లు, ఫొటోలు అంతర్జాలం నుంచి సేకరిస్తున్నారు. ఉన్నతాధికారుల ఫొటోలను వాట్సప్,ఫేస్ బుక్ ఖాతాలకు డీపీలుగా పెడుతున్నారు. నకిలీ వాట్సప్ ఖాతాల నుంచి క్రింది స్థాయి సిబ్బందికి "హాయ్ ఐ యామ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జంట్" అంటూ మెస్సేజ్ పంపుతారు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్ కట్ చేస్తారు. "నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను" తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని తిరుగు సమాధానం పంపుతారు. సిబ్బంది నమ్మే విధంగా మెస్సేజ్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ ఖాతా తయారు చేశారు.

'యూ ఆర్​ అండర్​ డిజిటల్​ అరెస్ట్​' - అంటే నమ్మకండి! - cyber crimes in AP

తనకు అత్యవసరంగా నగదు పంపాలని నకిలీ ఖాతా నుంచి కింది స్థాయి సిబ్బందికి మెస్సేజ్ చేశారు. మెస్సేజ్ వచ్చిన తీరుపై అనుమానం రావటంతో సిబ్బంది వాటిని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఇది నకిలీ ఖాతాగా గుర్తించిన ఎండీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణాలో ఏకంగా డీజీపీ ఫొటోతోనే నకిలీ వాట్సప్ ఖాతా తయారు చేసి నగదు పంపాలని కోరారంటే సైబర్ క్రిమినల్స్ ఎంత బరితెగించారో అర్ధమవుతోంది. నకిలీ ఫోన్‌, సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి : నగదు పంపాలని వాట్సప్,ఫేస్ బుక్ ఖాతాల్లో నుంచి మెస్సేజ్ వస్తే వాటిని నిర్ధారించుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ తరహా నేరాలు రాజస్థాన్ భరత్ పూర్ నుంచి జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలు - వాటిని ఎదుర్కొనే మార్గాలు ఇవే!! - Cyber Crime Safety Measures

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.