ETV Bharat / state

పొలాలను వీడని వరద- రైతన్నలకు తీరని వ్యథ - Crops Loss Due to Floods in Guntur

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 10:25 AM IST

Crops Loss Due to Floods in Guntur District : పదిరోజుల క్రితం వరకూ అవన్నీ పంట పొలాలు! ఇప్పుడు నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పైర్లు నీటి పాలయ్యాయి. వరదలు వచ్చి పది రోజులు దాటినా పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. గుంటూరు వాహినికి పడిన గండ్లు.. రైతులకు కడగండ్లనే మిగిల్చాయి.

crops_loss_due_to_floods_in_guntur_district
crops_loss_due_to_floods_in_guntur_district (ETV Bharat)

Crops Loss Due to Floods in Guntur District : గుంటూరు జిల్లాలో పది రోజుల క్రితం వరకూ పంట పొలాలు పచ్చని పైర్లతో కళకళలాడాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు చాలా కాలం తర్వాత జలకళను సంతరించుకోవడంతో వరి, పత్తి, మినుము, ఇతర ఉద్యాన పంటల దిగుబడిపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐతే కృష్ణమ్మ ఉగ్రరూపంతో పంటల్ని ముంచెత్తడం అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. రైతుల కష్టాల్ని వరదపాలు చేసింది.

గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా వరద నష్టం జరిగింది. ఇక్కడ మూడు మండలాల్లో కలిపి 17 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెప్తున్నారు. పెదకాకాని మండలంలోనే 7 వేల ఎకరాల వరి నీట మునిగింది. పెదకాకాని, వెంకటకృష్ణాపురం, దేవరాయబొట్లపాలెంలో వేల ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. చేబ్రోలు మండలంలో 6500 ఎకరాల్లో వరి, 680 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పొన్నూరు మండలంలో 4 వేల ఎకరాల వరికి నష్టం వాటిల్లింది.

'నష్టపోయిన వారంతా సన్నకారు రైతులే, 85 శాతం కౌలు రైతులూ ఉన్నారు. ఇప్పటికే ఎకారానికి రూ. 35 వేల దాక కౌలు కట్టాము, పంటకు రూ. 15 వేల నుంచి రూ. 20వేల దాకా ఖర్చులు అయ్యాయి. ఒక్క ఎకరం కూడా రికవర్​ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఏ రైతును కదిలించినా కష్టాలే ఉన్నాయి. మా వరి మాగాణి నంబూరు నుంచి వచ్చే మురుగు కాలువ వల్ల మునిగింది. చేనులో అయిదు అడుగుల మేర నీరు చేరింది, ఇప్పటికీ అలాగే ఉంది. వ్యవసాయమే మా జీవనాధారం. ఇప్పుడు మేము ఏమీ చెయ్యలేని పరిస్థుతుల్లో ఉన్నాము.' - బాధిత రైతులు

వరద తాకిడికి అన్నదాత విలవిల- నీటిపారుదల శాఖకు సవాల్​గా గండ్ల పూడ్చివేత - CANALS DAMAGE IN GUNTUR

వర్షాలు, వరదలకు గుంటూరు వాహినికి పలు చోట్ల గండ్లు పడటం వల్లే పంట నష్టం ఎక్కువగా జరిగింది. గత ఐదేళ్లలో పాలకులు ఈ కాలువలో ఎలాంటి పూడిక తీయలేదు. ఎక్కడికక్కడ గుర్రపు డెక్క అల్లుకుపోయింది. కాలువ గట్లూ దెబ్బతిన్నా మరమ్మతులు చేయలేదు.

కళ్లెదుటే కొట్టుకుపోయిన కర్షకుల కష్టం - కేంద్ర బృందం ఎదుట ఆవేదన వ్యక్తం - Central Team To Assess Flood Damage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.