ETV Bharat / state

సైబర్ నేరాలపై విజయవాడ సీపీ ప్రత్యేక దృష్టి - నగర వ్యాప్తంగా కమాండోలు ఏర్పాటు - CP Formed Commandos on Cyber Crimes - CP FORMED COMMANDOS ON CYBER CRIMES

CP Formed Commandos Against Cyber Crimes: ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు వెళ్లాలని విజయవాడ సీపీ తెలిపారు. సమాజంలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. సైబర్​ నేరాలను అంతం చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సీపీ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ పరిదిలోని పోలీస్ సిబ్బందిని, మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేశారు.

cp_on_cyber_crimes
cp_on_cyber_crimes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 5:56 PM IST

CP Formed Commandos Against Cyber Crimes: నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజ శేఖర్ బాబు తెలిపారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయని అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వెయవచ్చని తెలిరారు. సైబర్​ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఆ నేరాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ఈ సైబర్​ నేరాలను అంతం చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సీపీ ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పోలీస్ సిబ్బందిని, మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేశారు.

ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి ఈ సైబర్ కమాండోలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటికే కమీషనరేట్ పరిదిలో అన్ని కళాశాలలో విద్యార్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగిన వారిని సైబర్ సోల్జర్స్​గా నమోదు చేశారు. ప్రతి సైబర్ కమాండోకు 10-15 మంది సోల్జర్స్​ను ఇవ్వడం జరుగుతుందని ఆ కమాండోలు సోల్జర్స్​కు గైడ్ చేస్తూ వారు ఎక్కువ మంది ప్రజలను సైబర్ సిటిజన్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు.

17మంది గంజాయి స్మగ్లర్లు అరెస్ట్- ముఠాల కదలికలపై నిరంతర నిఘా : సీపీ - Cannabis smugglers arrested

కమాండోలకు సైబర్ నేరాలు అనేవి ఆన్ లైన్ లో గేమ్స్, ఆన్ లైన్ లోన్స్, క్యూఆర్​ కోడ్ స్కాన్ చేయడం, పార్ట్ టైం జాబ్స్ అంటూ వాట్సాప్ ద్వారా, పేస్​బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రాం మొదలైన యాప్​ల ద్వారా ఫేక్ ఐడీలు, మెసేజ్ రూపంలో వచ్చే లింకులు, బ్యాంక్ కేవైసీ అప్​డేట్, ఓఎల్​ఎక్స్​ నుంచి ఆర్మీ అధికారులము అని చెప్పి తక్కువ రేట్​కు వస్తువులు అమ్ముతున్నట్లు చూపించడం, దిల్లీ, ముంబాయి పోలిసులము అని చెప్పి తప్పుడు కాల్స్ చేయడం ద్వారా, కస్టమర్​కేర్ ద్వారా వచ్చే కాల్స్​తో ఏ విధంగా ప్రజలు సైబర్ నేరాల భారిన పడతారు అనే విషయాలపై పూర్తిగా అవగాహన కల్పించారు.

వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP

ఇంటిలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై బదిలీ వేటు - EC transfers Intelligence DG and SP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.