ETV Bharat / state

విజయవాడలో కోరలు చాచుతున్న డయేరియా - ఇంకా కళ్లు తెరవని నగర పాలక సంస్థ! - Contaminated Drinking Water - CONTAMINATED DRINKING WATER

Contaminated Drinking Water Problem in Vijayawada : విజయవాడలో కలుషిత నీరు వల్ల డయేరియా కోరలు చాచుతుంది. ఇప్పటికే డయేరియా వల్ల ఏడుగురు మృతి చెందారు. ఇంకా వందలాది మంది డయేరియా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

drinking_water_problem
drinking_water_problem (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 9:30 AM IST

విజయవాడలో కోరలు చాచుతున్న డయేరియా - ఇంకా కళ్లు తెరవని నగర పాలక సంస్థ! (ETV Bharat)

Contaminated Drinking Water Problem in Vijayawada : విజయవాడలో కలుషిత నీరు కోరలు చాచుతోంది. ఇప్పటికే ఏడుగురిని బలి తీసుకుంది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా అధికారులు, పాలకుల అలసత్వంతో గరళ జలం తాగుతూ అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. బాధితుల్లో నిరుపేదలే అధికంగా ఉంటున్నారు. కలుషిత నీరు పైప్‌లైన్లలో కలుస్తున్నా వీఎంసీ (VMC) అధికారులు చోద్యం చూస్తున్నారని నగర వాసులు మండిపడుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Water Problem in Vijayawada : విజయవాడలో అతిసార ప్రబలుతోంది. మొగల్రాజపురంలోని పలు వీధుల్లో ప్రారంభమైన డయేరియా నగరంలో వేగంగా విస్తరిస్తోంది. మొగల్రాజపురం ప్రాంతంలో ఇప్పటికే ఏడుగురు అతిసార లక్షణాలతో ప్రాణాలు విడిచారు. వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. పాయకాపురం, సింగ్‌నగర్‌ ప్రాంతాల్లోనూ బాధితులు స్థానిక పీహెచ్​సీలో చికిత్స పొందుతున్నారు. నగరంలో పలు కాలనీల్లో రంగుమారిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు వాపోతున్నారు. కలుషిత నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏ మాత్రం చలనం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం- ఇంకా ఎంతమందిని బలిగొంటారు?: సీపీఎం - Water Problem In Vijayawada

Polluted Water in Vijayawada : పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శుద్ధిపై కార్పొరేషన్‌ అధికారులు శ్రద్ధ చూపడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ట్యాంకులు పాకురు పట్టి ఉన్నాయని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్వహణ లోపభూయిష్ఠంగా తయారైందని వాపోతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కేవలం ఏడు అడుగుల లోతులోనే నీరు ఉండటంతో ఇంటేక్‌ వెల్‌లోకి మొత్తం బురద నీరు వస్తోంది. ఈ నీటిని పలు దశల్లో శుభ్రం చేయాల్సి ఉండగా అరకొర ట్రీట్‌మెంట్‌తో నేరుగా పంపింగ్‌ చేస్తున్నారు. కుళాయి నీరు తాగేందుకు వీలుగా లేకపోవడంతో అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టి క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇతర అవసరాలకు కలుషిత నీటినే వినియోగించాల్సి రావడంతో చర్మ సంబంధ వ్యాధులు సోకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జలమా! హాలాహలమా? - ప్రజల ప్రాణాలను కాటేస్తున్న కలుషిత నీరు - Contaminated Drinking Water

People Suffer for Water : డయేరియా కలకలంతో ఆలస్యంగా మేల్కొన్న కార్పొరేషన్‌ అధికారులు వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరుతో రక్తనమూనాలు సేకరించారు. వాటి ఫలితాలను వైద్యారోగ్య శాఖ ఇప్పటివరకూ వెల్లడించలేదు. నీటి నమూనాల పరీక్షలు ఫలితాలను వెల్లడించలేదు. అతిసార ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయలేదని అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తుప్పుపట్టిన పైపులైన్లు, రంగుమారిన నీరు- కలుషిత జలాలతో పేదల ప్రాణాలు గాలిలో! - DRINKING WATER PROBLEM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.