ETV Bharat / state

రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది- సీఎం రేవంత్ రెడ్డి - Congress Leaders Condoled Death of Ramoji Rao

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 6:49 PM IST

Congress Leaders Condoled the Death of Ramoji Rao: ఈనాడు గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు అస్తమయంతో ప్రముఖ రాజకీయ నేతలు తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సంతాపం ప్రకటించారు. తెలుగు మీడియా, చిత్రపరిశ్రమకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.

Congress_Leaders_Condolences_to_Ramoji_Rao
Congress_Leaders_Condolences_to_Ramoji_Rao (ETV Bharat)

Congress Leaders Condolences To Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయంతో ప్రముఖ రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగంలో ఆయన చేసిన ఎనలేని కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ ఫిలిం​ సిటీలో ఉంచిన ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

దేశంలోని పత్రికా రంగానికి తీరని లోటు : పత్రికలు ప్రచార సాధనాలు కూడా ప్రతిపక్షాలుగా ప్రధాన పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తి పాలకుల నుంచి వాటిని పరిష్కరించడానికి పోరాడిన వ్యక్తి అని పేర్కొన్నారు. రామోజీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాంటి మహనీయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి సత్కరించుకుంటామని వెల్లడించారు. రామోజీరావు మరణం దేశంలోని పత్రికా రంగానికి తీరని లోటు అన్నారు.

"రామోజీరావు దేశ రాజకీయాల్లో, పత్రిక, ప్రసార రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడి పత్రికలు ప్రతిపక్ష సాధనలు పాత్ర పోషిస్తాయని నిరూపించారు. వ్యాపారంలో, ప్రజాసేవలో ప్రజా సమస్యలను లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగేలా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

రామోజీరావు పార్ధివదేహానికి చంద్రబాబు నివాళి - Tribute to Ramoji Rao

రామోజీరావు ఒక లెజెండ్ : రామోజీరావు జీవతం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన నడవడిక తెలుగు జాతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించిన తుమ్మల ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు లెజెండ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి అన్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

శ్రమిస్తే ఎంత ఎత్తుకైనా ఎదుగుతాం అన్నదానికి రామోజీరావు నిదర్శనం అని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న ఆయన ఎంతో మందికి ఆదర్శమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన ఏ రంగంలో అడుగు పెట్టినా మంచి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. రామోజీరావు పార్థివదేహానికి కడియం శ్రీహరి నివాళులర్పించారు. జర్నలిజం రంగానికి ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రమాణస్వీకారం తర్వాత రామోజీరావు గారిని కలుద్దామనుకున్నా: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Tribute to Ramoji Rao

రామోజీరావు అస్తమయం- కాంగ్రెస్ నేతల సంతాపం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.