Congress Leader Hanmantha Rao: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. అధికారం ఉందని ఎగిరేగిరిపడితే ప్రజలే సరైన బుద్ధి చెప్తారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రికి సొంత సోదరిపైనే ప్రేమ లేదు: సొంత సోదరిపైనే ప్రేమ లేని జగన్, మహిళ సాధికారత అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జైళ్లో ఉన్నప్పుడు షర్మిల, జగన్‌కు మద్దతు ఇచ్చిందని అన్నారు. వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాదని ఆరోపణలు చేస్తూ పోస్టర్ల ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కష్ట కాలంలో ఉన్నప్పుడు సాయం చేసిన షర్మిలపై, ఇలా పోస్టర్లు విడుదల చేసి విష ప్రచారం చేస్తుంటే జగన్ సైలెంట్‌గా ఉండడమేంటని ప్రశ్నించారు. షర్మిల ఏపీకి వెళ్లగానే జగన్‌కు భయం పట్టుకుందన్నారు.
హైదరాబాద్‌లోనూ 'విశాఖ ఉక్కు' తరహా ఉద్యమం: మాజీ ఎంపీ వీహెచ్
సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్‌కి బాధ్యత లేదా: తల్లిని, చెల్లిని ముఖ్యమంత్రి జగన్ దూరం పెట్టారని, సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే, స్పందించే బాధ్యత జగన్‌కి లేదా అని ప్రశ్నించారు. షర్మిల, సునీతలపై జగన్‌కి గౌరవం లేదని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా అని అసహనం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కక్ష సాధింపు మానుకోవాలి : ఇప్పటికైనా చెడు సంప్రదాయాలని జగన్ పక్కన పెట్టాలని, పవర్ ఉందని జగన్ ఎగిరెగిరి పడితే ప్రజలు తగిన బుద్ది చెప్తారని సూచించారు. జగన్ ఇప్పటికైనా తన సోదరిపై కక్ష సాధింపు మానుకోవాలని అన్నారు. వివేకా కూతురు సునీత న్యాయం కోసం పోరాడుతోందని వీహెచ్ అన్నారు. షర్మిల పై పోస్టర్స్ వేసిన వాళ్లపై జగన్ చర్యలు తీసుకోవాలని, సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తుంటే జగన్ మౌనంగా ఉన్నారని అన్నారు.
'కక్ష సాధింపులు మానుకోండి... పాలనపై దృష్టి పెట్టండి'
షర్మిల ఏపీ రాగానే జగన్‌కు భయం పట్టుకుంది: చెల్లికి అవమానం జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని, రేపు తల్లికి అవమానం జరిగినా జగన్ పట్టించుకోడని వి.హెచ్ దుయ్యబట్టారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని అన్నారు. తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణలో వచ్చినా తీర్పును చూసైనా జగన్మోహన్ రెడ్డి మారాలని వీహెచ్ సూచించారు.
ఘనంగా మల్లెం హనుమంతరావు జన్మదిన వేడుకలు