Congress Incharge Manickam Tagore Fires on Jagan : జగన్ తన పదవీకాలమంతా వసూళ్లతోనే గడిపారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ విమర్శించారు. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ చేసిన పోస్టుపై ఆయన ఘటుగా స్పందించారు. ప్రజా సమస్యలపై పరిష్కారమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత అంటూ వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. దీనికి మాణికం ఠాగూర్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ధనవంతుల్నే కలిసేవారని ఆరోపించారు. పదవీ కాలమంతా వసూళ్లతోనే బిజిబిజీగా గడిపారని మండిపడ్డారు. ప్రజా దర్బార్ పేరిట సమస్యలు తెలుసుకునే ఆలోచనే చేయలేదని ధ్వజమెత్తారు. నిజానికి జగన్ ఎప్పుడూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అనుసరించలేదని మండిపడ్డారని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ చేసిన ట్వీట్ : ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. రోజూ ఉదయం ప్రజలను కలిసిన తర్వాతే తన దినచర్య ప్రారంభమయ్యేది.
డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు- జగన్ సమాజానికి ప్రమాదం: తులసిరెడ్డి
ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిపై కేసులేయడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పాతాళంలో కూరుకుపోయారని పలువురు రాజకీయనేతలు మండిపడుతున్నారు. జగన్ కోసం నేను, అమ్మ ఎంతో కష్టపడ్డాం. ఐదేళ్లుగా ఎంవోయూ నా దగ్గర ఉన్నా ఒక్క మీడియా హౌస్‌కు వెళ్లలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంవోయూ వాడుకోలేదు, ఎక్కడా బయటపెట్టలేదని అన్నారు. వైఎస్ కుటుంబం గురించి చెడ్డగా చెప్పుకొంటారనే ఎంవోయూ గురించి ఎప్పుడూ చెప్పలేదన్నారు. జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్ర చేశానన్నారు. చెల్లి కోసం ఇది చేశానని జగన్ జన్మలో ఒక్కటైనా చెప్పగలరా? జగన్ బెయిల్ రద్దవుతుంది కాబట్టి కోర్టులో కేసు వేశామని చెబుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆదివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్‌కు ముఠాగా పనిచేసే సజ్జల, వైవీసుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి.. ఆదేశాలు రాగానే చెప్పింది చేస్తారని విమర్శించారు. సీఎం చంద్రబాబు చేతిలో జగన్ సోదరి వైఎస్ షర్మిల కీలుబొమ్మగా మారిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే జగన్ ఫ్యామిలీలో డ్రామా నడుస్తోందన్నారు. ‘షర్మిల, జగన్‌కు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని షర్మిల చెప్పారు. ఆస్తుల పంపకాల విషయమై ఎంవోయూ జరిగినట్లు చెప్పారు.