CM Revanth wants Vigilance Inquiry into Fish and Sheep Distribution : చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఆ రెండు పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ విభాగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమికంగా తేలిన అంశాలను ఏసీబీతో పంచుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Fish and Sheep Distribution Case : చేపలు, గొర్రెల పంపిణీ(Sheep Distribution Scheme)లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. గొర్రెల పంపిణీకి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. గొర్రెల అమ్మకందార్లకు ఇవ్వాల్సిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు గుర్తించి ఏసీబీ నలుగురు అధికారులను కూడా అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ
Telangana Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు గత నెలలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ(ACB) పూర్తి తీగను లాగింది. రంగంలోకి దిగిన విచారణ బృందం మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు అంచనా వేశారు.
అయితే ఈ క్రమంలో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని దస్త్రాలు, హార్డ్ డిస్క్‌లు మాయమైనట్లు అధికారులు గుర్తించి, అధికారుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేశారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులను ప్రశ్నించారు. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు వీరికి మార్చి 7వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించి, చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మొహిదుద్దీన్ బినామీల ఖాతాలకు నగదు జమ : వీరి నలుగురిని కస్టడీలోకి తీసుకొని విచారించగా ఏసీబీ కీలక విషయాలను సేకరించింది. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ ముఠా నిధుల మళ్లింపులకి పశుసంవర్ధక శాఖలోని సీనియర్ అధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవ సరఫరాదారుల బ్యాంకు ఖాతాలకు బదులు మొహిదుద్దీన్ బినామీల బ్యాంకు ఖాతాలను రికార్డుల్లో చేర్చినందుకు ఆ అధికారికి లక్షల్లోనే వాటాలు పొందినట్లు ఏసీబీ భావిస్తోంది. అతడి ఒత్తిడితోనే నలుగురు అధికారులు మొహిదుద్దీన్ ముఠాకు సహకరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
అసలు సరఫరాదారులకు బదులుగా మొహిదుద్దీన్ సూచించిన సుమారు 10 మంది బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేశారు. వారంతా మొహిదుద్దీన్ బినామీలే. సరఫరాదారులకు కాకుండా మొహిదుద్దీన్ బినామీల ఖాతాల్లోకి రూ. 2.10 కోట్లు మళ్లించారు. ఇప్పుడు ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు. వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం : సీఎం రేవంత్