ETV Bharat / state

విద్యుత్​పై న్యాయవిచారణ కోరింది వాళ్లే - వద్దంటోంది వాళ్లే : సీఎం రేవంత్​రెడ్డి - CM REVANTH SLAMS BRS IN TG ASSEMBLY

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 12:29 PM IST

Updated : Jul 29, 2024, 2:05 PM IST

CM Revanth Slams BRS in Assembly Session 2024 : బీఆర్ఎస్ పాలనలో విద్యుత్​ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. విద్యుత్​ అంశంపై న్యాయవిచారణ కోరింది బీఆర్ఎస్​ సభ్యులేనని, నిజానిజాలు బయటకు వస్తాయని వద్దంటున్నది వాళ్లేనని వ్యాఖ్యానించారు.

CM Revanth on Electricity Commissions
CM Revanth slams BRS party (ETV Bharat)

CM Revanth on Electricity Purchase Commission : బీఆర్ఎస్​ పాలనలో విద్యుత్​ ప్రాజెక్టుల నిర్మాణంలో సివిల్‌ వర్క్స్‌ అన్నీ గులాబీ నేతల బినామీలకే ఇచ్చారని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. వాళ్ల పార్టీవారికి ఇచ్చిన పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో ఇవాళ విద్యుత్​ అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయవిచారణ అంశంపై మాట్లాడారు.

విద్యుత్‌ అంశంలో న్యాయవిచారణ కోరిందే బీఆర్ఎస్​ సభ్యులని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. జగదీశ్వర్‌రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ను సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో ఉన్నట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విచారణ కమిషన్‌ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యుల నిజాయతీ బయటకు వచ్చేదని వ్యాఖ్యానించారు. విద్యుత్​ న్యాయవిచారణ కోరిందివాళ్లే, వద్దంటున్నది వాళ్లేనని రేవంత్​ మండిపడ్డారు.

కొత్త ఛైర్మన్​ను నియమిస్తాం : విద్యుత్ కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ ఎందుకు హాజరుకాలేదని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. విద్యుత్‌పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ​ విచారణ కమిషన్​కు కొత్త ఛైర్మన్‌ను సాయంత్రం నియమిస్తామని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమిషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని , విద్యుత్ అంశంలో విచారణ వద్దని కోర్టును అడిగారని వ్యాఖ్యానించారు.

ఆగస్టు ఆఖరికల్లా రూ.2 లక్షల్లోపు రైతు రుణమాఫీ : సీఎం రేవంత్‌ రెడ్డి - CM REVANTH on crop loan

కమీషన్లకు ఆశపడే : బీఆర్ఎస్​ పాలనలో కాలం చెల్లిన సబ్ క్రిటికల్​ టెక్నాలజీతో భద్రాద్రి పవర్​ ప్లాంట్ నిర్మించారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. అప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని గుర్తుచేశారు. అప్పటి బీఆర్ఎస్ నేతలు కమీషన్లకు ఆశపడి ఇండియా బుల్స్​ అనే గుజరాత్​ కంపెనీతో కూడబలుక్కుని, బీహెచ్​ఈఏల్​ నుంచి నామినేషన్​ బేసిస్​​ మీద సబ్ క్రిటికల్​ టెక్నాలజీ మెషీన్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.​

గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్​ తెలిపారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టుకు ఏడేళ్లు పట్టిందని పేర్కొన్నారు. యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు 2021లోపు పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నారని, ఇప్పటికీ పూర్తి కాలేదని మండిపడ్డారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తికి మరో రెండేళ్లు పడుతుందని వెల్లడించారు.

యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చడానికే విచారణ కమిషన్‌ వేశామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డికి ఊడిగం చేసింది మీరు కాదా? అని సీఎం వ్యాఖ్యానించారు. తెలుగుదేశంలో ఉండికూడా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి సభలో మాట్లాడానని తెలిపారు. తనను జైలుకు పంపించినా భయపడలేదని, నిలబడి కొట్లాడానన్నారు. వాళ్లు అబద్ధాలు మానకపోతే, తాను నిజాలు చెప్పడం మాననని సీఎం తెలిపారు.

"బీఆర్ఎస్​ పాలనలో కాలం చెల్లిన సబ్ క్రిటికల్​ టెక్నాలజీతో భద్రాద్రి పవర్​ ప్లాంట్ నిర్మించారు. అప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం అప్పటికే చట్టం తీసుకువచ్చింది. అప్పటి బీఆర్ఎస్ నేతలు కమీషన్లకు ఆశపడి ఇండియా బుల్స్​ అనే గుజరాత్​ కంపెనీతో కూడబలుక్కుని, బీహెచ్​ఈఏల్​ నుంచి నామినేషన్​ బేసిస్​​ మీద సబ్ క్రిటికల్​ టెక్నాలజీ మెషిన్లను కొనుగోలు చేశారు". - రేవంత్​రెడ్డి, సీఎం

'నెట్ ​జీరో' సిటీని సందర్శించిన సీఎం రేవంత్​ రెడ్డి

తెలంగాణలోని వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షిస్తుంది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth On Qutb Shahi tombs

Last Updated : Jul 29, 2024, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.