CM Revanth Reddy met BRS MLA Pocharam Srinivas Reddy : తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారాన్ని కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం పట్ల పోచారం సానుకూలంగా స్పందించడంతో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, కుమారుడు భాస్కర్ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరడంతో 'కారు'కు పెద్ద షాక్ తగిలినట్లైంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు. పోచారం సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చామని చెప్పారు. పోచారం సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
"తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశాము. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం. తెలంగాణ రైతుల సంక్షేమ కోసం పోచారం కాంగ్రెస్లో చేరారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తాం. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. భవిష్యత్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం. ఇది రైతు రాజ్యం. రైతు సంక్షేమ రాజ్యం. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతాం." - రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్ - AP Assembly Sessions 2024
బీఆర్ఎస్ నేతల నిరసన : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోచారం ఇంట్లో సీఎం రేవంత్ ఉండగానే ఇంటి బయట బీఆర్ఎస్ నిరసనలు తెలిపింది. పోచారం నివాసం వద్ద బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట, కాస్త ఘర్షణ జరిగింది. బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు - cm chandrababu entered to assembly