CM Jagan Rushing on TIDCO Construction Houses : సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదలపై ఎంత కక్షతో వ్యవహరిస్తారో చెప్పేందుకు టిడ్కో ఇళ్ల రద్దే ఇందుకు నిదర్శనం. జగన్ 2019 జూన్‌లో అధికారం చేపట్టేసరికి గత తెలుగుదేశం ప్రభత్వం చేపట్టిన 3.13 లక్షల టిడ్కో గృహాల్లో 95శాతంపైగా పూర్తయినవి 81,000 ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పించి లబ్ధిదారులకు ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చు. కానీ జగన్ అలా చేయలేదు. ప్రస్తుత్తం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తాను పేదల సీఎం అని నిరూపించుకోవడం కోసం టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు నానా హంగామా చేస్తున్నారు.
80 శాతం పనులు పూర్తి : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని బలిఘట్టం సమీపంలో రెండు చోట్ల పొరపాలక సంఘపరధిలోని లబ్ధిదారుల కోసం 1,824 టిడ్కో గృహాలను అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్దేశించిన బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఈ తరుణంలో ఎన్నికలు సమీపించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తి చేసుకుని కేవలం తాగు నీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారుల నిర్మాణం, మరుగు దొడ్లు వంటి మిగులు పనులు చేపట్టాల్సి ఉంది. ఇలా వివిధ కారణాల వల్ల టిడ్కో గృహాల నిర్మాణ పనులు ఆగిపోయాయి.
సమస్యలతో స్వాగతం పలుకుతున్న టిడ్కో ఇళ్లు
టిడ్కో గృహాలు విష సర్పాలకు నిలయం : గతంలో ఎన్నికల ప్రచారానికి నర్సీపట్నం వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రూపాయికే ఇల్లు కేటాయిస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన నాటి నుంచి వీటిపై కన్నెత్తి చూడలేదని ఆ ప్రాంత స్థానిక లబ్ధిదారులు వాపోతున్నారు. నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో పెచ్చులు ఊడిపోతున్నాయని, విద్యుత్తు సదుపాయం లేక వెలవెలబోతున్నాయని స్థానికులు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహణ కరవు ఫలితంగా టిడ్కో గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. గృహాలు చెదలు పట్టి విష సర్పాలకు నిలయంగా మారాయని ఆరోపిస్తున్నారు.
అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారులు - చేతులెత్తేసిన వైఎస్ జగన్ సర్కారు
గృహాలను సందర్శిస్తూ అధికారులు : టిడ్కో గృహాల నిర్మాణానికి సంబంధించి పలుసార్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండడంతో టిడ్కో గృహాల నిర్మాణాలపై జగన్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వీటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవడానికి పనులు పూర్తి చేయడానికి వేగం పెంచింది. దీనిలో భాగంగా నర్సీపట్నం మున్సిపల్ అధికారులు ఈ గృహాలను సందర్శిస్తూ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని సకాలంలో లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
సమస్యల నడుమ కాలం వెళ్లదీస్తున్న టిడ్కో లబ్ధిదారులు - తీసుకొచ్చి నరకంలో పడేశారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం