ETV Bharat / state

ఒప్పంద ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన జగన్‌- నాలుగేళ్లు నిద్రపోయి! - Contract Employees Regularization - CONTRACT EMPLOYEES REGULARIZATION

Contract Employees Regularization: అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం.! వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం, ఎన్నికలకు ముందు ఇలా ఊరించి ఓట్లు వేయించుకున్నారు. పీఠమెక్కాక ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీశారు. ఎన్నికలకు ముందు నిబంధనల కత్తి దూసి వీలైనంత మంది ఆశలను తెగ్గోశారు. కొలువు క్రమబద్ధీకరణ అవుతుందేమోనని ఆశపడిన వారంతా ఇక నిన్ను నమ్మం జగన్‌ అంటున్నారు.

Contract_Employees_Regularization
Contract_Employees_Regularization
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 9:05 AM IST

ఒప్పంద ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన జగన్‌- నాలుగేళ్లు నిద్రపోయి!

Contract Employees Regularization: మాటలతో మాయ చేయడంలో జగన్‌ను మించిన ఘనులే లేరు. ఎన్నికల ముందు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. 2019 ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీతో వారిలో ఆశలు కల్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో సాగదీసి, కొంతమందికి మాత్రమే చేసి చేతులెత్తేశారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీ మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు ఆయనకు గుర్తుకురాలేదు.

కోడ్‌ వస్తుందని తెలిసి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ హడావిడి చేశారు. అలాగైనా మాట నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. అన్ని శాఖల్లో కలిసి 50వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే వారిలో కేవలం 10వేల 117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులని వైసీపీ సర్కారు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేనాటికి కేవలం 3వేల 350మందిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేసింది.

అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తానని ప్రతిపక్షనేతగా ప్రతి సభలోనూ జగన్‌ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు దీని గురించే పట్టించుకోలేదు. గతేడాది తీరిగ్గా ఈ అంశంపై కసరత్తు చేపట్టిన ప్రభుత్వం అర్హుల సంఖ్యను భారీగా కుదించాలనే ఉద్దేశంతో 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై ఒప్పంద ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఐదేళ్ల నిబంధనను తొలగించింది.

విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత- 25వేల కిలోలు స్వాధీనం చేసుకున్న సీబీఐ - CBI SEIZED 25 THOUSAND KGS DRUGS

ఆ తర్వాత ఒప్పంద ఉద్యోగి పనిచేస్తున్న పోస్టు ప్రభుత్వం మంజూరు చేసిందై ఉండాలనీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటికీ మంజూరు పోస్టులోనే పనిచేస్తూ ఉండాలనే నిబంధన విధించింది. ఉద్యోగ నియామకానికి ప్రకటన ఇచ్చి ఉండాలనీ, ఆ పోస్టుకు రిజర్వేషన్‌ రోస్టర్‌ అమలు చేసి ఉండాలని ఇంకో నియమం పెట్టింది. సబ్జెక్టు సైతం క్లియర్‌ వెకెన్సీ ఉండాలని, ఏపీపీఎస్సీ(APPSC)ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఇలా అనేక వడపోతలతో ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేసింది.

ఇంటర్మీడియట్‌ బోర్డు ఉద్యోగుల్లో 2014 ముందు నుంచి ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నవారు 3,593 మంది ఉన్నారు. వీరిలో ఒక్కర్ని కూడా క్రమబద్ధీకరించలేదు. లెక్చరర్‌ పోస్టు జోనల్‌ స్థాయి కాగా స్థానికంగా ప్రిన్సిపాళ్లే ప్రకటనలు ఇచ్చి నియామకాలు పూర్తిచేశారు. ఇలాంటి వాటిని పరిశీలిస్తున్నామంటూ ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు సాగదీసిన ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.

విశాఖ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేతపై చంద్రబాబు, పవన్ స్పందన- జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ - Chandrababu reacted on Drugs Case

రాష్ట్రంలో 82 జూనియర్‌ కళాశాలలకు అసలు మంజూరు పోస్టులే లేవు. ఇక్కడ ఒప్పంద లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం అందర్నీ క్రమబద్ధీకరించాలనుకుంటే వీటికి పోస్టులను మంజూరు చేసి, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయవచ్చు. 2021లో ఏపీపీఎస్సీ ద్వారా 180 మంది నియామకమైతే వారి కోసం అప్పటికే మంజూరు పోస్టుల్లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద ఉద్యోగులను నాన్‌-సాంక్షన్డ్‌ పోస్టులోకి మార్చేశారు. ఇది ప్రభుత్వం చేసిన మార్పే అయినా దాని ఫలితం మాత్రం ఒప్పంద ఉద్యోగులు అనుభవించాల్సి వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఒప్పంద ఉద్యోగులు 309 మంది ఉన్నారు. వీరిలో కేవలం ఇద్దర్ని మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారు. వర్క్‌షాపు అటెండర్లలో అర్హులైనవారు 140 మంది ఉండగా కేవలం 22 మందినే చేశారు. డిగ్రీ కళాశాలల్లో అర్హులైన వారు 650 మంది ఉండగా వీరిలో ఒక్కర్నీ చేయలేదు. వైద్యారోగ్యశాఖలో ఒప్పంద విధానంలో పని చేస్తున్న వారిలో 3,821 మందికి క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నా కోర్టు కేసులు సాకుగా చూపుతూ సుమారు వెయ్యి మందిని పక్కన పెట్టారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి : నారా భువనేశ్వరి - Nijam Gelavali Yatra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.