ETV Bharat / state

అభివృద్ధి కోసం అయితే అప్పు వద్దు - జగన్‌ సర్కార్ తీరుపై అధికారుల విస్మయం - Negligence on Irrigation Projects

CM Jagan Negligence on Irrigation Projects: అభివృద్ధి పేరు చెబితే చాలూ సీఎం జగన్‌ ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఈక్రమంలోనే తెలుగుదేశం హయాంలో తెచ్చిన నీటి ప్రాజెక్టులకూ చెల్లుచీటీ పాడారు. మామూలుగా అప్పులు మీద అప్పులు చేస్తున్న సీఎం జగన్, నీటి ప్రాజెక్టుల కోసం జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ , ప్రపంచ బ్యాంకు రుణం వద్దన్నారు. చివరికి పనులు చేయలేమంటూ ఆర్థిక శాఖతో ఒత్తిడి తెచ్చి, జల వనరుల శాఖతో ఉత్తర్వులిచ్చేలా చేసి ప్రాజెక్టుల్లో 18 వందల 30 కోట్ల మేర కోత విధించారు.

CM_Jagan_Negligence_on_Irrigation_Projects

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 7:18 AM IST

అభివృద్ధి కోసం అయితే అప్పు వద్దు - జగన్‌ సర్కార్ తీరుపై అధికారుల విస్మయం

CM Jagan Negligence on Irrigation Projects: ఏ ప్రభుత్వమైనా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనుకుంటుంది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని బాధ్యతగా భావిస్తుంది. ఎంత అవకాశం ఉంటే అంతగా నిధులను సమీకరించి అభివృద్ధిబాటలో పరుగులు తీయాలనుకుంటుంది. రివర్స్‌ పాలన సాగించే జగన్‌ సర్కారు ఇందుకు విరుద్ధంగా వెళుతోంది. 2016-18 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి ప్రాజెక్టు నివేదికలు పంపి రాష్ట్రంలో చిన్ననీటి వనరులను పునరుద్ధరించి, లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించేందుకు ప్రపంచబ్యాంకు, జైకా సంస్థల రుణం సమీకరించి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కాదు పొమ్మంటోంది.

ఏడేళ్ల ప్రాజెక్టు కాలం పూర్తవుతోంది. ఇప్పటికే ఆ నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయాలి. వైసీపీ సర్కార్‌ రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోగా ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టుల్లోనూ భారీ కోత పెట్టింది. ప్రపంచ బ్యాంకు, జైకా సాయంతో 3 వేల600 కోట్లతో నాడు ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పుడు అందులో 18 వందల 30 కోట్ల కోత పెట్టేస్తూ తాజాగా జల వనరులశాఖ ఉన్నతాధికారులు పాలనా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రాజెక్టుల స్వరూపమే మారిపోయింది. అభివృద్ధి కోసం రుణం ఇస్తామన్నా వద్దంటున్న జగన్‌ ప్రభుత్వ తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

'రాష్ట్రమంతా కరవు తాండవం' - నదుల అనుసంధానంపై ఊసెత్తని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం

తెలుగుదేశం హయాంలో జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో రాష్ట్రంలో నీటి పారుదల ఆధారంగా జీవనాభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఒక పథకాన్ని చేపట్టారు. ఇందులో జైకా సాయం 17 వందల కోట్లు కాగా, రాష్ట్ర వాటా 300 కోట్లు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 445 చిన్న నీటి చెరువులను పునరుద్ధరించడంతో పాటు ఒక భారీ, 19 మధ్య తరహా ప్రాజెక్టులను ఆధునికీకరించాలని ప్రతిపాదించారు. కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం డీపీఆర్‌లు తయారయ్యాయి. వాటిని రాష్ట్ర సాంకేతిక కమిటీ ముందుంచి, ఆమోదం పొంది, తర్వాత కేంద్ర అనుమతితో సాయం చేసేందుకు జైకా అంగీకరించింది.

2017 డిసెంబరులో ఈ ప్రాజెక్టుకు జలవనరులశాఖ 2 వేల కోట్లతో పాలనామోదం ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు పడకేసింది. జైకా ఇచ్చిన సొమ్ములనూ సరిగా ఖర్చుపెట్టకపోవడంతో ఆ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర వాటా ఇచ్చేందుకు ముందుకురాని సర్కార్, ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేపట్టలేమంటూ చేతులెత్తేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునీకీకరణ, 445 చిన్ననీటి వనరుల చెరువుల పునరుద్ధరణకు నాడు 942 కోట్ల 43 లక్షలు కేటాయించారు.

ప్రస్తుతం 319 చెరువుల పునరుద్ధరణకే అనుమతిస్తూ, 730 కోట్లు ఖర్చు చేసేలా తగ్గించారు.ఈ ప్రాజెక్టులో పనులకు గతంలో 600 సాగునీటి సంఘాల భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తే ప్రస్తుతం 480 సంఘాలకే పరిమితం చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని 89 కోట్ల 43 లక్షల నుంచి 16 కోట్లకు కుదించేశారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల పాత్రను తగ్గించి ప్రాజెక్టు వ్యయంలో 115 కోట్ల వరకు కోత పెట్టారు. ఇతరత్రా అనేక విభాగాల్లో కోట్ల రూపాయల్లో తగ్గించేశారు.

ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్​ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే

ప్రపంచ బ్యాంకు సాయంతో ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్టుకు తెలుగుదేశం హయాంలో 2016 చివర్లో 16 వందల కోట్ల రూపాయలతో పాలనామోదం ఇచ్చారు. అనేక చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో ప్రపంచబ్యాంకు రుణం 11 వందల 20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 480 కోట్లు. తొలివిడతగా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 260 కోట్లను వినియోగించడమే తప్ప నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో 880 కోట్ల పనుల్ని ఉపసంహరిస్తూ మొత్తం వ్యయాన్ని 720 కోట్లకు కుదిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టులో భాగంగా ఆయకట్టుకు సాగునీరిందించే సామర్థ్యం పెంచే పనులకు నాడు 950 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం దానిలో 350 కోట్లు కోత పెట్టేశారు. వెయ్యి చెరువుల పునరుద్ధరణకు 869 కోట్ల 70 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం దాన్ని 575 కోట్లకు తగ్గించేశారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకే ఈ ప్రాజెక్టుల స్వరూపం మార్చేయాలని నిర్ణయించింది. పనులకు సహకరించకుండా రాష్ట్ర వాటా నిధులివ్వకుండా సతాయించింది. ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల స్వరూపం తగ్గించి కోత పెట్టాలంటూ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు జల వనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ పనులు చేయలేమంటూ నస పెట్టారు. జలవనరుల శాఖ స్వల్పకోతలతో ప్రతిపాదనలు పంపితే వెనక్కి తిప్పి పంపుతూ వచ్చారు. చివరికి ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 50 శాతం కోత పెడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.