ETV Bharat / state

ప్యాలెస్‌లలో మీరు - పిచ్చుక గూళ్లో పేదలు - ఇప్పుడు చెప్పు జగన్ పెత్తందారు ఎవరో? - CM Jagan Irregularities - CM JAGAN IRREGULARITIES

CM Jagan Irregularities: 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడని అర్థం! ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ చేస్తోంది అదే! అణువణువునా పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్‌ లక్షణాలతో చెలరేగిపోతూ, పైగా ఇతరులపై పెత్తందారులని ముద్రవేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది.

CM Jagan Irregularities
CM Jagan Irregularities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 9:05 AM IST

CM Jagan Irregularities : 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడని అర్థం! ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ చేస్తోంది అదే! అణువణువునా పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్‌ లక్షణాలతో చెలరేగిపోతూ, పైగా ఇతరులపై పెత్తందారులని ముద్రవేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది. ప్రజల్ని అమాయకుల్ని చేసి వారి సంపదను అక్రమంగా దోచేసి, కోట్లకు పడగలెత్తిన వ్యక్తిని, ఆధిపత్య ధోరణితో దాష్టీకాలకు, దౌర్జన్యాలకు తెగబడే వ్యక్తినే కదా పెత్తందారు అంటారు. నేను చెప్పిందే వేదం నా మాటకు ఎవరూ ఎదురు మాట్లాడకూడదన్న దురహంకారంతో కన్నూమిన్నూ కానకుండా, అణచివేతకు పాల్పడేవాళ్లనే కదా పెత్తందార్లు అంటారు.

ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న మీరు ఇతరులపై పెత్తందార్లని అభాండాలు వేయడమేంటి జగన్‌? అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో రూ.వేల కోట్లకు పడగలెత్తి, రాజమహళ్లను తలదన్నే ప్యాలెస్‌లలో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ, అడుగు కదిపితే ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని ఒక నియంతలా పరిపాలించిన మీరు కాదా అసలు సిసలు పెత్తందారు. సంపాదనపై విపరీతమైన యావ ఉన్నవారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ల ఆశకు అంతులేదని అంటారు. కానీ జగన్‌ ఆశ అనంతం. కనిపించినంత మేర భూమ్యాకాశాల్ని కలిపి మింగేయాలనే దురాశ ఆయన సొంతం!

దందాలు, దోపిడీల మధ్య నలిగిపోయిన సాగరనగరం - విశాఖను నంజుకుతిన్న వైసీపీ నేతలు - YSRCP Destroyed Visakhapatnam

జగన్‌కు లాండ్‌ క్రూయిజ్‌లు - ప్రజలకు డొక్కు బస్సులా? : రహదారులు అభివృద్ధికి చిరునామాలు. నాగరికతకు చిహ్నాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగాలన్నా, వృద్ధి చెందాలన్నా మెరుగైన రహదారులుండాలి. ఆధునిక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు, అన్ని రాష్ట్రాలూ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. కానీ ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం కొత్త రహదారులు నిర్మించలేదు సరికదా కనీసం గుంతలనూ పూడ్చలేదు. జగన్‌ ఏడెనిమిది కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌లో వెళతారు. తాడేపల్లి నుంచి విజయవాడ వచ్చేటప్పుడు ఆయనకు కుదుపు తెలియకుండా జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డుపై ఉన్న స్పీడ్‌బ్రేకర్లనూ నునుపు చేసేశారు.

అధికారంలోకి రాగానే ఆయన కోసం ఖరీదైన లాండ్‌ క్రూయిజ్‌లు కొన్నారు. ఆయన సిద్ధం యాత్రలకు వెళ్లడానికి రూ.20 కోట్లతో బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సుల్ని ఆర్టీసీ సమకూర్చింది. కానీ ప్రజలు మాత్రం గుంతల రోడ్లలో, డొక్కుబస్సుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలి. గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకోవాలి. గుంతలు పూడ్చడం, కొత్త బస్సులు కొనడం తెలియదు గానీ ఐదేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీల్ని, గరిష్ఠంగా 61% పెంచేసి సామాన్యుల నడ్డివిరిచారు. ఇంతకంటే పెత్తందారీతనం ఏముంటుంది జగన్‌?

దేవుళ్లయినా ప్యాలెస్‌కు రావాల్సిందే : జగన్‌ పెత్తందారీ పోకడల ముందు సామాన్యులైనా, దేవుళ్లయినా ఒక్కటే! చరిత్రలో మహా చక్రవర్తులు, దేశాధినేతలే దేవాలయాలకు వెళ్లి దేవుడిని కొలిచారు. కానీ జగన్‌ తీరే వేరు. దేవుళ్లయినా తాడేపల్లి ప్యాలెస్‌కు రావాల్సిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటి సందర్భంలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం వెళతారు. అదీ సతీసమేతంగా కాకుండా, ఒక్కరే వెళతారు. మిగతా సందర్భాల్లో తాడేపల్లి ప్యాలెస్‌లో దేవాలయం సెట్టింగులు వేసి దేవుళ్లనే అక్కడికి రప్పిస్తారు. ఇది కదా అసలైన పెత్తందారీతనం జగన్‌?

న్యాయవ్యవస్థపైనే ఎదురుదాడి : ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల్ని తప్పుపడుతూ తీర్పులిచ్చినందుకు న్యాయమూర్తులపైనే సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు దాడి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిపై సీఐడీతో కేసులు నమోదు చేయించినా దర్యాప్తు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. చివరకు హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వీల్లేదని, వెంటనే పనులు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించినా పెడచెవిన పెట్టారు. జీఓలు ఆన్‌లైన్‌లో పెట్టాలన్న ఆదేశాన్నీ బేఖాతరు చేశారు. కోర్టునే ధిక్కరించడం పెత్తందారీతనం కాదా?

చితికిన కౌలు రైతు బతుకు - గడిచిన ఐదేళ్లుగా ధీమా లేదు, బీమా రాదు! - Jagan Neglect Tenant Farmers

అవినాష్‌రెడ్డిని అడ్డగోలుగా కాపాడటాన్ని ఏమంటారు? : సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని జగన్‌ అడ్డగోలుగా కాపాడుతున్నారు. ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ వస్తే రౌడీమూకల్ని, పోలీసుల్ని ఉసిగొల్పి అడ్డుకున్నారు. సీబీఐపైనే ఎదురు కేసులు పెట్టించారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనకే లోక్‌సభ టికెట్‌ ఇచ్చారు. ఇది కాదా పెత్తందారీ పోకడ?

బాధితుల పరామర్శకూ మనసు రాదు : వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నా వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలకు వెళతారు. బాధితులకు అండగా ఉంటారు. మంత్రుల్ని, అధికారుల్ని పరుగులు పెట్టిస్తారు. కానీ జగన్‌ తీరే వేరు. ఆయన ఏ ప్రకృతి విపత్తు సమయంలోనూ వెంటనే వెళ్లిందిలేదు. మహా అయితే హెలికాప్టర్‌లో ఒక రౌండ్‌ వేసి వస్తారు. ఏ వారం పది రోజులకో తీరిగ్గా అక్కడికి వెళతారు. తాను చేసే ప్రతి పనినీ సమర్థించుకోవడానికి జగన్‌ దగ్గర ఒక థియరీ ఉంటుంది.

తాను వెంటనే వెళ్తే అధికార యంత్రాంగం మొత్తం తన చుట్టూనే ఉంటుందని, సహాయక చర్యలకు అవరోధం కలుగుతుందనేది ఆయన చెప్పిన సూత్రీకరణ. అందుకే ఐదేళ్లూ మట్టి అంటకుండా, చొక్కా నలగకుండా కాలం గడిపేశారు. గత సంవత్సరం డిసెంబరులో భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటన తీరే దానికి నిదర్శనం. జాతీయరహదారిపై వేసిన టెంట్‌లో రెడ్‌కార్పెట్‌పై సీఎం నిలబడితే... అధికారులే దెబ్బతిన్న వరికంకులు తెచ్చి ఆయనకు చూపించారు. పెత్తందారీ పోకడకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో దీన్నిబట్టే అర్థమవుతుంది.

అమరావతిపై కక్షగట్టి సర్వనాశనం చేయడాన్ని ఏమనాలి? : అమరావతి ప్రపంచం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ వైపు తిరిగిచూసేలా చేసిన ప్రాజెక్టు. దేశ, విదేశాలకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థలు, కంపెనీలు భాగస్వామ్యం పంచుకున్న, ఇటీవల ప్రపంచంలోనే అతి పెద్ద కసరత్తుతో మొదలైన ప్రాజెక్టు. అలాంటి అమరావతికి మీరెలాంటి దుర్గతి పట్టించారు జగన్‌? దేశంలో నగరాల నిర్మాణమే తక్కువ! పట్టణీకరణ పెరుగుతున్న తరుణంలో కొత్త నగరాల అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేసే, ఉపాధికి, సంపదసృష్టికి కేంద్రంగా నిలిచే అద్భుతమైన గ్రీన్‌ఫీల్డ్‌ నగర నిర్మాణాన్ని గత ప్రభుత్వం తలపెడితే మీరేం చేశారు?

దేళ్ల క్రితం 24 గంటలూ వేలమంది కార్మికులు నిర్విరామంగా కొనసాగించిన అమరావతి నిర్మాణ పనుల్ని ఒక్క కలంపోటుతో ఆపేశారు. మరో ఆరు నెలలకు మూడు రాజధానులన్న మాటతో ఐదుకోట్ల ఆంధ్రుల ఆశల్ని కూల్చేశారు. ఇప్పుడు ముళ్లకంచెల మధ్య సగం పూర్తయిన నిర్మాణాల్ని, ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్న పునాదుల్ని చూస్తే మీరు తప్ప ఎంత పాషాణ హృదయాలైనా కరిగిపోతాయే? ఇది కాదా పెత్తందారీ మనస్తత్వం జగన్‌?

ఎస్సీ, ఎస్టీలపై ఎన్నడూ లేనంత దాష్టీకాలు : నిద్రలేస్తే చాలు నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని గుండెలు బాదుకునే జగన్‌ పాలనలో వారిపై జరిగినన్ని అరాచకాలు, అఘాయిత్యాలు, పోలీసుల వేధింపులు గతంలో ఎన్నడూ లేవు. మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌, మాస్క్‌ ధరించలేదని చీరాలకు చెందిన కిరణ్‌ వంటివారికి ఏ దుర్గతి పట్టించారో మర్చిపోయారా? నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం పోలీసుల వేధింపులు తాళలేక రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడితే ఏం చర్య తీసుకున్నారు? మా అక్కను వేధిస్తున్నారేమని అడిగిన బాలుడు అమర్నాథ్‌గౌడ్‌ను మంటల్లో కాల్చి చంపేస్తే, మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ డ్రైవర్‌ని చంపేసి డోర్‌డెలివరీ చేస్తే కనీసం పట్టించుకున్నారా? పైగా రంపచోడవరం నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తుల్ని కోర్టు దోషిగా నిర్ధరించినా దళితుల మనోభావాలు గాయపడతాయని తెలిసినా, ఆయననే మీ పార్టీ అభ్యర్థిగా కొనసాగించడం పెత్తందారీతనం కాదా?

భూములిచ్చిన రైతుల గోడు ఏనాడైనా విన్నారా? : ఈ ఐదేళ్లలో జగన్‌ ఎప్పుడూ బాధితుల గోడు వినలేదు. రాజధాని నిర్మాణానికి 29వేల మంది రైతులు 33వేల ఎకరాల భూములిచ్చారు. వారంతా సన్న, చిన్నకారు రైతులే. అమరావతి నుంచి రాజధానిని మార్చేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వారి బతుకులు ఏమవుతాయని ఆలోచించారా? వారంతా 1,600 రోజులకుపైగా ఉద్యమం చేస్తుంటే ఒక్కరోజైనా పిలిచి మాట్లాడారా? పైగా లాఠీఛార్జ్‌లు, నిర్బంధాలు, అక్రమ కేసులు, అరెస్టులతో వారి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేయాలనుకున్నారే?

రాజధాని వచ్చిందన్న ఉద్దేశంతో కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకూ అనేకమంది మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు స్థలాలు కొనుక్కున్నారు. మీ మూడు రాజధానుల నిర్ణయంతో రూ.10వేల కోట్ల సంపద ఆవిరైపోయిందే, అమరావతికి చుట్టూ 50 కి.మీ. పరిధిలో ఆస్తుల విలువ పడిపోయి, ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా దెబ్బతిన్నాయే దీనికి కారణం ఎవరు? ప్రజలకు ఆర్థిక, మానసికపరంగా తీవ్ర వేదన మిగిల్చిన పెత్తందారు మీరు కాదా?

లెక్కలేనన్ని అక్రమాస్తులు - అత్యంత విలాసవంతమైన జీవితం ! : దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్‌. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో పేర్కొన్న అక్రమాస్తుల విలువే రూ.43వేల కోట్లు. విపక్షాల ఆరోపణల ప్రకారం ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా కొన్ని లక్షల కోట్లు సంపాదించారు. సాధారణంగా ప్రజాజీవితంలో ఉన్న నాయకులు సంపదను ప్రదర్శించరు. కానీ జగన్‌ విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు, తన సంపదను ప్రదర్శించేందుకు ఏమాత్రం మొహమాటపడరు! ఆయన ధరించే దుస్తులు, వాచ్‌, చెప్పులు.. అన్నీ అత్యంత ఖరీదైనవే!

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కాలు కదిపితే ప్రత్యేక విమానమో, హెలికాప్టరో ఉండాల్సిందే. తన ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతిలో జరిగిన సభకు హెలికాప్టర్‌లో వెళ్లిన ఘనుడాయన. గత ఏడాది సెప్టెంబరులో జగన్‌, ఆయన సతీమణి లండన్‌లోని కుమార్తెలను చూసేందుకు వెళ్లారు. వారు రూ.435 కోట్ల విలువైన ‘ఎంబ్రాయెర్‌ లినేజ్‌-1000’ అనే అత్యంత విలాసవంతమైన ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. ఆ విమానానికి గంటకు అద్దె 14,850 డాలర్లు. అంటే రూ.12 లక్షలపైనే. అంతకుముందు దావోస్‌ వెళ్లినప్పుడూ సతీసమేతంగా ప్రత్యేక విమానంలో మొదట లండన్‌ వెళ్లి, ఆమెను అక్కడ దించి, ఆయన దావోస్‌ చేరుకున్నారని విమర్శలు వచ్చాయి.

జగన్‌ ఆ మధ్య దిల్లీకి, తర్వాత కర్నూలు వెళ్లినప్పుడూ హైదరాబాద్‌ మీదుగా ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. భార్య భారతిని హైదరాబాద్‌లో దించి తిరుగు ప్రయాణంలో మళ్లీ హైదరాబాద్‌ వచ్చి ఆమెను తీసుకుని విజయవాడ చేరుకున్నారు. భార్య కోసం ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టే ఈ పెత్తందారు. మిగతావాళ్లను పెత్తందారు అనడం కంటే విడ్డూరం ఏముంటుంది?

మీ రాజప్రాసాదం చుట్టుపక్కల పేదలు ఉండకూడదా? : తాడేపల్లి మధ్యతరగతి, బడుగు బలహీనవర్గాలు నివసించే ప్రాంతం. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అక్కడ రెండు ఖరీదైన భవనాలు నిర్మించుకున్నారు. ఆ ఇంటి పక్కనే ఉన్న విలాసవంతమైన విల్లాలూ ఆయన మనుషులవే. జగన్‌ సీఎం అయ్యాక ఇంటివెనుక కట్టపై పేదల ఇళ్లు ఉండటం నామోషీగా భావించారు. 317 మంది పేదలకు నోటీసులిచ్చి ఖాళీచేయించి, కూలగొట్టారు. అరకొర పరిహారంతో సరిపెట్టారు. తన సోదరుడు అనిల్‌కుమార్‌కు ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వకుండానే ఇంటిని కూల్చేశారని పోరాడిన శివశ్రీని పోలీసులు నిర్బంధించి వేధించారు. ఒకరోజు బయటకు వెళ్లిన అనిల్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. వైకాపా నాయకులే చంపేసుంటారని శివశ్రీ అప్పట్లో ఆరోపించారు. పేదల గుడిసెలు తీసేసి సీఎం ఇంటికి వెళ్లేమార్గంలో నాలుగు వరుసల రహదారి వేశారు. ఆ మార్గాన్ని వినియోగించేది సీఎం, కొద్దిమంది నాయకులు, అధికారులే. మీ రాజభవంతికి పక్కనే పేదల ఇళ్లను తొలగించడం అధికార దురహంకారం కాదా? ఇది పెత్తందారీ పోకడ కాదా?

ఊరూరా రాజమహళ్లు - పేదలకు సెంటు ఇళ్లు : స్వతంత్ర భారతదేశంలో మరే నాయకుడికీ జగన్‌ అంత ఇళ్ల పిచ్చి ఉండదేమో! 2004కి ముందు ఖర్చులకు డబ్బుల్లేక హైదరాబాద్‌లోని నివాసాన్ని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి డెవలప్‌మెంట్‌కి ఇచ్చిన పరిస్థితి వైఎస్‌ కుటుంబానిది! అలాంటిది వైఎస్‌ సీఎం కాగానే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు దోచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి ఊరికో రాజభవనం నిర్మించుకున్నారు. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో 23 ఎకరాల్లో అమెరికా అధ్యక్ష భవనాన్ని తలదన్నేలా కళ్లుచెదిరే ప్యాలెస్‌ నిర్మించారు. దాని విలువ రూ.400 కోట్లకుపైమాటే!

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో 5,807 చదరపు గజాల్లో 88వేల చదరపు అడుగుల రాజభవనం నిర్మాణానికి నిధులు మళ్లించేందుకు నాలుగు డొల్ల కంపెనీల్నే ఏర్పాటు చేశారు. తాడేపల్లి, పులివెందుల భవనాలు సరేసరి. ఇవన్నీ చాలవన్నట్టు విశాఖలో రుషికొండపై రూ.430 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మరో రాజమహల్‌ కట్టేశారు. ప్రముఖ పాప్‌గాయకుడు మైకేల్‌ జాక్సన్‌, బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ వంటివారికి ప్రత్యేకంగా ద్వీపాల్లో అత్యంత విలాసవంతమైన భవంతులున్నాయని, వాటిలో 20-30 పడక గదులు, స్విమ్మింగ్‌పూల్‌, గోల్ఫ్‌కోర్స్‌ ఉంటాయని వినేవాళ్లం.

ఇప్పుడు మన దేశంలో అలాంటి భవంతుల గురించి మాట్లాడాల్సి వస్తే జగన్‌ ప్యాలెస్‌లు మొదటి వరుసలో ఉంటాయి. అలాంటి జగన్‌కి పేదలపై ఎంత ప్రేమంటే వారు ఇల్లు కట్టుకోవడానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి తానేదో అపర దానకర్ణుడినన్నట్టు ఊదరగొడుతుంటారు. 48 గజాల్లో పిచ్చుక గూళ్లలాంటి ఇళ్లు కట్టుకుని పిల్లాపాపలతో పేదలు కాపురం ఎలా చేయాలి జగన్‌? ఇల్లు కట్టుకోవడానికి కేంద్రం ఇచ్చే రూ.1.80 లక్షలు సరిపోవని మరో రూ.లక్ష ఆర్థికసాయం కావాలని లబ్ధిదారులు అడిగితే కనికరించారా? గత ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు పాడుబెట్టారు? పెత్తందారీతనం అంటే ఇది కాదా?

బడుగు, బలహీనవర్గాల ఉపాధికి మంగళం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు కులాలవారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్‌ ఐదేళ్లలో వాటిద్వారా చేసింది గుండుసున్నా. ఆయా వర్గాలు తమ కాళ్లపై నిలబడేందుకు, పేదరికం నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చిన రాయితీ రుణాలు, మార్జిన్‌ మనీలు, సబ్సిడీలకు జగన్‌ మంగళం పాడారు. సంక్షేమ కార్యక్రమాల ముసుగులో రూ.వేల కోట్ల నిధుల్ని వారికి దక్కకుండా చేసి, ఉపాధికి గండికొట్టారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసి, తనవాళ్లకు పదవులు కట్టబెట్టి, రూ.కోట్ల ప్రజాధనాన్ని వారికి జీతభత్యాల కింద దోచిపెట్టారు. ఇది కదా అసలైన పెత్తందారీతనమంటే?

ఎంపీలు, ఎమ్మెల్యేల్ని కరివేపాకులా తీసిపారేశారు : జగన్‌ దృష్టిలో పార్టీ, ప్రభుత్వం ఆయన వల్లే నడుస్తాయి. మిగతా వాళ్లంతా డమ్మీలే! మంత్రులు, సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్ని ఆయన కరివేపాకుల్లా తీసిపారేస్తారు. జనం తనను చూసి ఓటేస్తారే తప్ప, వారికి ఎలాంటి విలువా లేదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. 2019 ఎన్నికలకు ముందు కూడా తన పార్టీ అభ్యర్థుల్ని తీసిపారేస్తూ మాట్లాడారు. మంత్రులు ఐదు కోట్ల ప్రజలకు, ఎంపీలు 16 లక్షల మంది, ఎమ్మెల్యేలు 2.5-3 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధులు. కానీ జగన్‌ దృష్టిలో వారెందుకూ కొరగానివారు. ఈ ఐదేళ్లలో ఒక్కసారీ వారిని కలవలేదు. ఇది అహంభావం, ఫ్యూడల్‌ మనస్తత్వం, పెత్తందారీతనం కాదా?

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించడం పెత్తందారీ పోకడ కాదా? విద్యావ్యవస్థను ఆటబొమ్మలా మార్చేసి, రోజుకో తుగ్లక్‌ నిర్ణయంతో ఇష్టానుసారం ఆడుకోవడాన్ని ఏమంటారు? రాత్రికి రాత్రే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టేశారు. దానికెవరూ వ్యతిరేకం కాదు. కానీ మీరు చేసిన సన్నద్ధత ఏంటి? సీబీఎస్‌ఈ, ఐబీ, బైజూస్‌ అంటూ రోజుకో విధానం తెచ్చారు. అతి తక్కువ సమయంలో విద్యార్థులపై ఇన్ని నిర్ణయాల్ని రుద్దినవాళ్లు మరొకరుండరేమో! అసలు ఇంగ్లిషు మీడియంలో బోధించే నైపుణ్యం టీచర్లకు ఉందో లేదో ఎప్పుడైనా చూశారా?

ఆరోతరగతి విద్యార్థులు కూడా చిన్న చిన్న లెక్కలూ చేయలేకపోతున్నారని, తప్పుల్లేకుండా నాలుగు మాటలు రాయలేకపోతున్నారని ప్రథమ్‌ సర్వేలు మొత్తుకుంటున్నాయి. మీరు మాత్రం పదోతరగతిలో 80-90 శాతం ఉత్తీర్ణత చూపిస్తారు. నైపుణ్యాల్లేకుండా ఆ పిల్లలు రేపు ఏమవ్వాలి? వాళ్లలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే కదా! క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని విస్మరించి, అస్తవ్యస్త విధానాలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, మొత్తం విద్యావ్యవస్థనే మార్చేస్తున్న సంస్కర్తలా పోజులివ్వడం, అందరూ మిమ్మల్ని అలా గుర్తించాలని కోరుకోవడం పెత్తందారీతనం కాదా?

జగన్‌ మార్కు ‘సొంత సామాజికవర్గ’ న్యాయం! : సీఎం జగన్‌ దృష్టిలో సామాజిక న్యాయం అంటే సొంత సామాజికవర్గాన్ని అందలం ఎక్కించడం. పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులన్నీ వారికే కట్టబెట్టడం. వారితో బడుగు, బలహీనవర్గాలపై పెత్తనం చేయించడం. అధికారం మొత్తాన్ని తన సామాజికవర్గానికి చెందిన నాయకులు, అధికారులకే కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కొన్ని అప్రాధాన్య పదవులు కట్టబెట్టి అధికారం మొత్తం తన సామాజికవర్గానికి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధనుంజయరెడ్డి, జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి వంటివారికి కట్టబెట్టడమే జగన్‌ మార్కు సామాజిక న్యాయం. సలహాదారులు, ఆదాయాన్ని సముపార్జించే కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవుల్లోనూ ఎక్కువమంది వారే. హోంమంత్రి పదవి మొదట సుచరితకు, ఆ తర్వాత వనితకు ఇచ్చినా వారు డమ్మీలే! ఉపముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలైనా వారూ డమ్మీలే! ఇది పెత్తందారీ పోకడ కాదా?

సామాన్యుల గోడు ఎప్పుడైనా విన్నారా? : ముఖ్యమంత్రిగా ఎవరున్నా కొంత సమయాన్ని సామాన్యుల గోడు వినడానికి కేటాయిస్తారు. కానీ ప్యాలెస్‌ గడపదాటి బయటకు అడుగుపెట్టడమే అరుదుగా చేసే జగన్‌ ఈ ఐదేళ్లలో జనాన్ని కలిసిందీ లేదు. వారి గోడు విన్నదీ లేదు. కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర దివ్యాంగురాలైన తన కుమార్తె వైద్యానికి సాయం కోసం తిరిగినా న్యాయం జరగక సీఎం ఇంటిదగ్గరే ఆత్మహత్యకు యత్నించారు. ఎన్నికల సమయంలో మాత్రం పేదలపై జగన్‌కు ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చింది. బస్సుయాత్రలో వారిని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరారు. ఇది కదా పెత్తందారీ పోకడ?

ఆర్టీసీ వినియోగంలో జగన్‌ పెత్తందారీబుద్ధి - 40 లక్షల మందికి తుక్కు బస్సులే - Problems In APSRTC Buses

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.