ETV Bharat / state

మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'! - CM Jagan Cheating Unemployed

CM Jagan Cheating Unemployed: ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు జగన్‌ సర్కార్ సిద్ధమైంది. మెగా డీఎస్సీ అంటూ ఊరించి కేవలం 6 వేల పోస్టులే ప్రకటించింది. 12ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిషిప్‌ విధానాన్ని తిరిగి తీసుకొస్తోంది. డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చిన వారు రెండేళ్ల పాటు వెట్టిచాకిరి చేయాల్సిందే.

CM_Jagan_Cheating_Unemployed
CM_Jagan_Cheating_Unemployed
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 7:05 AM IST

మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!

CM Jagan Cheating Unemployed : ప్రతిపక్షలో ఉన్నప్పుడు ఇలా నోటికొచ్చినట్లు జగన్‌ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 23 వేల ఖాళీలున్నట్లు జగన్‌ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ (AP DSC) అంటూ నాలుగున్నరేళ్లు ఊరించిన జగన్‌ ఇప్పుడు నిరుద్యోగులకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. డీఎస్సీ వేయమంటే వెట్టిచాకిరి చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఎప్పుడో 12ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిషిప్‌ను విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఒక పక్క డీఎస్సీ పోస్టుల్లో కోత వేసి మరోవైపు రెండేళ్లు తక్కువ జీతాలకు పని చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. డీఎస్సీలో 6,100 పోస్టులు, అప్రెంటిషిప్‌ విధానాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

AP DSC Notification 2024 : టీడీపీ హయాంలో డీఎస్సీ-2018 ఇస్తే నాలుగున్నరేళ్లు ఏం గాడిదలు కాశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తే అంతేనా అన్న జగన్ ఇప్పుడు వాటి కంటే 1,802 పోస్టులు తగ్గించేశారు.

మెగా డీఎస్సీకి మంత్రి వర్గం ఆమోదం - కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన

Unemployed Youth in AP : మెగా డీఎస్సీ అంటే ఇదేనా? అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మండల, జిల్లా పరిషత్తు, పురపాలక బడుల్లో 1,88,182 పోస్టులు ఉంటే పని చేస్తున్న వారు 1,68,642 మంది. అంటే 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆదర్శ పాఠశాలలు, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ పాఠశా లలు కలిపితే ఈ ఖాళీలు 28 వేలకు పైనే ఉన్నాయి. మండల, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లోనే 8,366 పోస్టులు అవసరం కానున్నట్లు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స ప్రకటించారు.

AP TET 2024 : ఇప్పుడు పాఠశాల విద్య, గిరిజన సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని బడుల్లో ఖాళీలతో కలిపి 6,100 పోస్టులకే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యలో 8 వేల ఖాళీలుంటే 2 వేల పోస్టుల్నే భర్తీ చేయబోతున్నారు. స్వచ్చంద పదవీ విరమణలు, కరోనా మరణాల వల్ల ఏర్పడిన ఖాళీలే 2 వేల దాకా ఉన్నాయి. ఇవికాకుండా త్వరలో జరగబోయే పదవీ విరమణల్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా పోస్టుల్ని పెంచాల్సింది పోయి కోతవేసి, నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతున్నప్పుడు పోస్టులు ఎలా తగ్గిపోయాయని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి - 'మేం మోసపోయాం' అంటూ నిరుద్యోగుల ఆందోళన

మరోవైపు జగన్ సర్కార్ ఇప్పుడు డీఎస్సీని ప్రకటించినా వచ్చే కొత్త ప్రభుత్వంలోనే పరీక్ష నిర్వహణ, భర్తీ ఉంటాయి. డీఎస్సీ ప్రకటనకు పరీక్ష నిర్వహణకు మధ్య 40 రోజులు సమయం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున పరీక్షలకే 15 రోజుల సమయం పడుతుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసేటప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పరీక్షల నిర్వహణ నిలిచిపోతుంది. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసగించేందుకే నాలుగున్నరేళ్ల మౌనంగా కూర్చొని ఓట్ల కోసం ఇప్పుడు డీఎస్సీని తీసుకొచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంక్రాంతి ఇంకా ఐపోలేదా బొత్స గారూ- కాస్త పండగ మూడ్​ నుంచి బయటకు రండి సారూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.