ETV Bharat / state

'జగనన్నతోడు' అంటూ కల్లబొల్లి కబుర్లు - వీధి వ్యాపారులను దగా చేసిన జగన్ - jagananna thodu scheme - JAGANANNA THODU SCHEME

CM Jagan Cheated Street Vendors: సంక్షేమ పథకాల సృష్టికర్త తానే అన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్, అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేళ్లుగా ప్రజలను నమ్మించారు. కానీ ఆయన పాలనలో పథకాల అమలు చూస్తే, వైసీపీ కార్యకర్తలకే పెద్దపీట అనేది సుష్పష్టం. ఇందుకు చిరు వ్యాపారులు సైతం మినహాయింపు కాదు. వారికి ‘జగనన్న తోడు ’ పేరుతో 10 వేల చొప్పున అందించే వడ్డీలేని రుణాల పథకమే ఇందుకు నిదర్శనం.

Jagananna_Thodu_Scheme
Jagananna_Thodu_Scheme
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 9:22 AM IST

Updated : Apr 27, 2024, 2:39 PM IST

CM Jagan Cheated Street Vendors: జగనన్న తోడు పథకంలో ఒక్కో చిరు వ్యాపారికి 10 వేల చొప్పున ఇచ్చే వడ్డీ లేని రుణాల లబ్ధిదారుల్లో సింహభాగం వైసీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారే, పుర, నగరపాలక సంస్థల సిబ్బంది దరఖాస్తుదారుల జాబితాను ఏటా ఎమ్మెల్యేలకు ఇవ్వడం, వారు సిఫార్సు చేసిన లబ్ధిదారుల పేర్లు బ్యాంకులకు పంపడం రివాజుగా మారింది. పథకం మొదలైన తరువాత 2020-21 నుంచి 2023-24 వరకు ఇదే తంతు.

మొదటిసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల 35 వేలు, చివరిసారి 2023-24లో 12 లక్షల మందితో కలిపి నాలుగేళ్లలో 36 లక్షల మంది చిరు వ్యాపారులకు 10 వేల చొప్పున రుణాలిచ్చినట్లుగా ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అసలు విషయానికొస్తే, విజయవాడ, విశాఖ, గుంటూరు, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు నగరపాలక సంస్థల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో సగం మంది వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులే. అర్హులైన నిరుపేద లబ్ధిదారుల దరఖాస్తులను పక్కన పెట్టి కార్యకర్తల జేబులు నింపారు.

చేసింది దగా-దాన్నే సాయమని ప్రచారం! సమాన పనికి సమాన వేతనమంటూ జగన్ మోసం - Jagan Cheat Outsourcing Employees

రికవరీ నామమాత్రమే: ఒకసారి తీసుకున్న 10 వేల రుణం వాయిదాల కింద బ్యాంకులకు సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండోసారి 11 వేలు, మూడోసారి 12 వేలు, నాలుగోసారి 13 వేల చొప్పున పెంచుతూ బ్యాంకులు రుణాలిచ్చేలా సీఎం జగన్‌ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రహదారుల పక్కన వ్యాపారం చేసే అర్హులు సకాలంలో బ్యాంకు రుణం చెల్లిస్తున్నారు. నేతల సిఫార్సులపై వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకు ఇచ్చిన రుణాల్లో రికవరీ నామమాత్రమే. ఇలాంటి వారెవరూ వ్యాపారం చేయడం లేదు. బ్యాంకులిచ్చిన 10 వేల రుణాన్ని మాత్రం స్వాహా చేశారు.

అత్యధికంగా వైసీపీ కార్యకర్తలే: లబ్ధిదారులుగా వైసీపీ కార్యకర్తలు చూపించిన చిరునామాల్లో తోపుడుబళ్లు, బడ్డీలు, టిఫిన్‌ కొట్లే కనిపించడం లేదు. ఇచ్చిన రుణాలు రికవరీ చేయడం బ్యాంకర్లకు సవాల్‌గా మారింది. పథకం ప్రారంభించాక ఇప్పటివరకు మొత్తం 3 వేల 668 కోట్ల రుణాలు బ్యాంకులిచ్చాయని అంచనా. ‘తప్పుడు పత్రాలు చూపించి రుణం తీసుకున్నారు. రికవరీ చేద్దామంటే వారెవరూ బ్యాంకుకి ఇచ్చిన చిరునామాలో లేరు. రాయలసీమ జిల్లాల్లో వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా వైసీపీ కార్యకర్తలే ఉన్నట్లు ఒక పరిశీలనలో వెల్లడైంది.

సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్‌- అయిదేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం - cm ys jagan cheating poor people

జగనన్న తోడు పథకంలో బ్యాంకులు రుణం ఇవ్వాలంటే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. రోడ్లపై వీరు ఎలాంటి వ్యాపారం చేస్తుంటారో వారి దుకాణాల ముందు ఫొటోలు దిగాలి. దీంతో గుర్తింపు కార్డులు జారీ చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించారు. అసలైన చిరు వ్యాపారుల్లో 40 నుంచి 60 శాతం మందికి గుర్తింపు కార్డుల్లేవు. విజయవాడలో కొన్ని బజార్లలో చిరు వ్యాపారుల నుంచి 200 చొప్పున సిబ్బంది వసూలు చేసినా కార్డులు జారీ చేయలేదు.

అసలైన వ్యాపారులకు ద్రోహం: విశాఖలో సగం మందికి కూడా కార్డులివ్వలేదు. గుంటూరులో 60 శాతం, తిరుపతిలో 40, కడపలో 50, కాకినాడలో 60, అనంతపురంలో 50 శాతం మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల్లేవు. వీరికి బ్యాంకులు రుణాలివ్వడం లేదు. విజయవాడ, విశాఖ, గుంటూరులో 30 వేల మంది వైసీపీ కార్యకర్తలకు చిరు వ్యాపారుల పేర్లతో గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఇతరుల దుకాణాల వద్ద వీరిని నిల్చోబెట్టి ఫొటోలు తీసి నగరపాలక సంస్థ సిబ్బంది వీరందరికీ 10 వేల చొప్పున బ్యాంకుల నుంచి రుణాలిప్పించి అసలైన వ్యాపారులకు ద్రోహం చేశారు.

సీఎం జగన్​ 'బాటా రేట్' వ్యూహం - 99 శాతం హామీల వెనక అసలు కథ ఏంటంటే !

కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుతోంది: పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసే వారికి బ్యాంకులు 10 వేల చొప్పున ఇస్తున్న రుణాలపై వడ్డీలో 7శాతం వరకు ప్రధానమంత్రి స్వనిధి కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతోంది. ఏటా 2 లక్షల నుంచి 2లక్షల 50 వేల మంది తీసుకునే రుణాలపై కేంద్రం వడ్డీ భరిస్తోంది. స్వనిధి పథకాన్ని జగనన్న తోడులో కలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఈ విషయాన్ని గత నాలుగేళ్లలో ప్రస్తావించిన దాఖలాల్లేవు. కార్యక్రమం మొత్తాన్ని రాష్ట్రమే తన ఖాతాలో వేసుకుంటోంది.

చిరు వ్యాపారులకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు 10 నుంచి 11 శాతం వరకు వడ్డీ విధిస్తున్నాయి. ఇందులో కేంద్రం 7 శాతం వడ్డీ చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులే భరించాలి. లబ్ధిదారులు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని జగనన్న తోడు కింద రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇందులో కేంద్రం భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని బైటకు చెప్పడం లేదు. లబ్ధిదారుల తరఫున వడ్డీ మొత్తాన్ని జగన్‌ సర్కారే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.

జాబ్ క్యాలెండర్​ను మడతెట్టేసిన 'జగన్ మామ' - నిరుద్యోగులతో బంతాట !

Last Updated : Apr 27, 2024, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.