ETV Bharat / state

ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్​స్టేషన్లు : చంద్రబాబు - CHANDRABABU REVIEW ON IT ISSUES

నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

chandrababu_review_on_it_issues
chandrababu_review_on_it_issues (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 5:42 PM IST

CM Chandrababu Review on IT Department: హైదరాబాద్​లోని హైటెక్ సిటీ తరహాలోనే అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను సూచించారు. నేటి యువత భవిష్యత్ డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఐటీ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైనా సీఎం చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కో-వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రూ.25 లక్షలు సీడ్ ఫండింగ్: స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుపై సీఎం పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5ప్రాంతాల్లో జోనల్‌ హబ్‌లకు కేంద్రంగా అమరావతిలో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' పనిచేయాలని చెప్పారు.

పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్

నెలకు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని చంద్రబాబు అన్నారు. పాలసీ ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్లు కూడా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. సచివాలయ ఉద్యోగులతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది వర్క్ ఫ్రం హోం కింద పనిచేస్తున్నారో మదింపు చేయాలన్నారు. వర్క్ స్టేషన్లకు వచ్చి పని చేసుకునే వారికి భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంపొదించాలన్నారు.

3 కేటగిరీలకు రాయితీలు: మరోవైపు ఐటీ సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌లు, ఐటీ క్యాంపస్‌లకు వాటి సీట్ల సామర్ధ్యం, కార్యాలయం విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • కో వర్కింగ్ స్పేస్‌కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్ఢ్యం కానీ, 10 వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలని నిర్ణయించారు.
  • నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌కు పది సీట్ల సామర్ధ్యం లేదా 1000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తప్పనిసరిగా పేర్కొన్నారు.
  • ఐటీ క్యాంపస్‌కు వచ్చే సరికి 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ. 30 కోట్ల టర్నోవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం తుది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే - వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది : సీఎం

అదానీ సంస్థ లంచాల వ్యవహారం - జగన్​పై ఏసీబీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.