ETV Bharat / state

మన్‌కీ బాత్‌ తరహాలో - 'మీతో మీ చంద్రబాబు' - CHANDRABABU PLAN TO NEW PROGRAM

ప్రజలకు మరింత చేరువకావడమే లక్ష్యంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు

Chandrababu Plan to New Program
Chandrababu Plan to New Program (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 9:39 AM IST

Chandrababu Plan to New Program : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌ గుర్తొస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం. ఈ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు.

సంక్రాంతి నుంచి మీతో మీ చంద్రబాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదిశగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు మన్‌ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం శాససనభ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో/ వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది.

ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన చేద్దాం: సీఎం చంద్రబాబు

2027లోపు పోలవరం పూర్తి - జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ పనులు: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.