CM Chandrababu Ordered Inquiry Into Anakapalli Incident: అనకాపల్లి జిల్లా కోటవురట్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. విద్యార్ధుల మరణాలకు కారణమైన వారిని అరెస్టు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనధికారిక అనాథాశ్రమాన్ని మూసివేయించి అక్కడున్న పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. మరోవైపు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అస్వస్థతకు గురైన బిడ్డల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు: ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రి లోకేశ్‌కు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు: అనకాపల్లిలో జరిగిన దురదృష్టకరమైన ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్ల ను తనిఖీ చేయాలనీ జిల్లా కలెక్టర్ లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయా హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా లేదో చూడాలని కలెక్టర్ల ను ఆదేశించారు. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణం లోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ఆరోగ్యకరమైన పరిస్థితుల ఉన్నాయో లేదో చూడాలని ఆదేశించారు. సంబధిత విభాగాలు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Home Minister Anita Serious: విద్యార్థుల మృతి చెందిన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దీనిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హాస్టల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. కేవలం కోటవురట్ల హాస్టల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న అన్ని హాస్టల్స్‌పైనా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఆశ్రమం నిర్వాహకులపై కేసు నమోదు: సీఎం చంద్రబాబు ఆదేశాలతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ పరామర్శించారు. ఈ ఘటనలో ఆశ్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేసే విధంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందిందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతోపాటు కలుషిత ఆహారానికి సంబంధించిన నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించామని కలెక్టర్ పేర్కొన్నారు.
10 లక్షలు పరిహారం: పాడేరులో చికిత్స పొందుతున్న విద్యార్థులను అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ పరామర్శించారు. వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు పరిహారం ప్రకటించారు. మిగతా విద్యార్థులను పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, డౌనూరు ఆసుపత్రులలో జాయిన్ చేసినట్లు చెప్పారు. సంబంధిత అనాథాశ్రమంపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు వైద్యులు అప్రమత్తమై సేవలందించినట్లు పేర్కొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - పరిస్థితి విషమం - Farmer Suicide Attempt