ETV Bharat / state

రాజముద్రతో భూమి పట్టాదారు పాసు పుస్తకాలు- స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు - CM Review On Revenue Department - CM REVIEW ON REVENUE DEPARTMENT

CM Chandrababu Review On Revenue Department: రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అదే విధంగా జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనేదానిపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది.

Chandrababu Review On Revenue
Chandrababu Review On Revenue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 3:52 PM IST

Updated : Jul 29, 2024, 4:57 PM IST

CM Chandrababu Review On Revenue Department: త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం 15 కోట్లు జగన్ ప్రభుత్వం తగలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు.

క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు.

జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనేదానిపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో 15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలికంగా అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అయ్యింది. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 5న కలెక్టర్లలతో సీఎం చంద్రబాబు సమావేశం

రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్దం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై చర్చించారు.

సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్​ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైనా చర్చ జరిగింది.

పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదు: పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు, భూ యజమానులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదన్నారు. తాము రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, దానిలో కొన్ని మార్పులను సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు.

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్​ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY

Last Updated : Jul 29, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.