ETV Bharat / state

అచ్యుతాపురం ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ- తప్పు చేసిన వారిని క్షమించం : చంద్రబాబు - chandrababu on Atchutapuram SEZ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 5:35 PM IST

Updated : Aug 22, 2024, 5:56 PM IST

CM Chandrababu Naidu On Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

CM Chandrababu Naidu On Atchutapuram SEZ Accident
CM Chandrababu Naidu On Atchutapuram SEZ Accident (ETV Bharat)

CM Chandrababu Naidu On Atchutapuram SEZ Accident : అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని ఆయన పరిశీలించారు. అనతరం ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తర్వతా ఆయన మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్‌ కంపెనీ పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించలేదని, పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగిందని తెలిపారు.

గత ఐదు సంవత్సరాల్లో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి : పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కానీ ఇక్కడ నిబంధనల మేరకు ఎస్‌వోపీ అనుసరించలేదని తెలుస్తోందని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదన్నారు. ఈ సెజ్ లో గత ఐదు సంవత్సరాల్లో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారని తెలిపారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్‌ కేటగిరిలోని పరిశ్రమలన్నీ కచ్చితంగా ఎస్‌వోపీని పాటించాలని స్పష్టం చేశారు.

'అండగా ఉంటాం- మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం' - అచ్యుతాపురం ప్రమాద బాధితులకు చంద్రబాబు భరోసా - CBN Consoles Atchutapuram Victims

కంపెనీ నుంచే పరిహారం ఇప్పిస్తాం : ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, పరిశ్రమలో ఏం జరిగింది. లోపాలపై కమిటీ విచారిస్తుందని వెల్లడించారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టమని, శిక్షిస్తామని, బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని తెలిపారు.

ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు : పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలకు ఉన్న ఇబ్బందులపైనా కమిటీ విచారిస్తుందని, పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవని అన్నారు. దాదాపు 90-95 శాతం పరిశ్రమలు బాధ్యత వహిస్తున్నాయని, కొన్ని పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాయని తెలిపారు.

ఆదాయం సృష్టిస్తేనే పేదరిక నిర్మూలన : రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. ఆదాయం సృష్టిస్తేనే పేదరిక నిర్మూలన జరుగుతుందని వెల్లడించారు.

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం - Ex gratia in Atchutapuram incident

అచ్యుతాపురం ప్రమాదం బాధాకరం - 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ: పవన్‌కల్యాణ్‌ - Pawan Kalyan reacts on Blast

Last Updated : Aug 22, 2024, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.