ETV Bharat / state

ఏపీలో జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ : సీఎం చంద్రబాబు

ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం - ఎస్సీ సంక్షేమం, అభివృద్ధిపై దళిత ఎమ్మెల్యేలతో చర్చ

CM Chandrababu on SC Categorisation
CM Chandrababu on SC Categorisation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 10:45 AM IST

CM Chandrababu on SC Categorisation : వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలకు సమాన అవకాశాలు దక్కుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లా యూనిట్​గా వర్గీకరణ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఎన్డీఏ కూటమి పార్టీల్లోని దళిత ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం విద్య ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించటం ద్వారా సమగ్ర దళిత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ఎవరికీ అన్యాయం జరగకుండా అమలు : జనాభా దామాషా పద్దతిన జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై దళిత ఎమ్మెల్యేలతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై సీఎం చర్చించారు. సమైక్య రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేశామని న్యాయ సమస్యలతో అప్పట్లో ఆ కార్యక్రమం నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ అమలుకు వివిధ రాష్ట్రాలు సిద్ధమయ్యాయని, రాష్ట్రంలోనూ ఎవరికీ అన్యాయం జరగకుండా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం కమిషన్ వేయనున్నట్లు తెలిపారు.

చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది: మందకృష్ణ - Manda Krishna Special thanks to cbn

ఎస్సీ సంక్షేమ పథకాల‌ను జగన్‌ రద్దు చేశారు : దళితులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ అండగా ఉందన్న చంద్రబాబు, జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని గుర్తు చేశారు. 2014 తరువాత జీవో నెంబర్ 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెట్టామని వివరించారు. గత ఐదేళ్లలో 29 ఎస్సీ సంక్షేమ పథకాల‌ను జగన్‌ రద్దు చేశారన్న సీఎం 2024 ఎన్నికల్లో 29 ఎస్సీ సీట్లకుగాను 27 చోట్ల కూటమిని ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తామన్నారు. 2029లో మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటానని, ప్రజల కోసం నిరంతరం పని చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.

ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధిపై ఇక నుంచి తరచూ ఆయా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతునని సీఎం చెప్పారు.

నిరంతర పోరాటానికి దక్కిన ఫలితం - ఎస్సీ వర్గీకరణపై పవన్ కల్యాణ్​ స్పందన - PK On SC ST Classification

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.