ETV Bharat / state

నాకు జరిగిన అన్యాయంపై ఎప్పడూ మాట్లాడను- రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఊరుకోను- చంద్రబాబు సూటి హెచ్చరిక - CM Chandrababu Meeting IAS

CM Chandrababu Meeting with IAS and IPS Officers : రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లులో వ్యవహరిచిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్​, ఐపీఎస్​ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అన్యాయంగా ప్రవర్తించారని మండిపడ్డారు

cbn_meet_ias
cbn_meet_ias (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 8:40 AM IST

Updated : Jun 14, 2024, 9:06 AM IST

CM Chandrababu Meeting with IAS and IPS Officers : అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్​, ఐపీఎస్​ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టం చేశారు. గురువారం (జూన్​ 13న) సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలకు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి ఐదారు నిమిషాలు మాట్లాడారు. వీరందరినీ తొలుత సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక సీఎం అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు.

నాకు జరిగిన అన్యాయంపై ఎప్పడూ మాట్లాడను- రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఊరుకోను- చంద్రబాబు సూటి హెచ్చరిక (ETV Bharat)

రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర, ప్రజావ్యతిరేక విధానాలే కారణమన్నారు. ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లకూ కీలకపాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదన్న చంద్రబాబు, తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని చెప్పారు.

ప్రజా పాలనకు చంద్రబాబు శ్రీకారం- 'ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది' - Chandrababu Ended Curtain Rule

పరిపాలన భ్రష్టుపట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై సీఎం చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత ఐదేళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయనను మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్టులయ్యారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరుగాంచిన శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌ వంటివారు ముందు వరుసలో, సీఎం చంద్రబాబు నాయుడుకు సమీపంలోనే కూర్చున్నారు.

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆ ఐదు హామీల అమలుకు తొలిరోజే గ్రీన్​సిగ్నల్​ - CM Chandrababu Signs Five Files

చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడున్న అధికారుల్లో కొందరు అప్పట్లో తనతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారని దేశానికే ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. కానీ గత ఐదేళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నారు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదన్నారు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్లీ పరిపాలన గాడిలో పెడతానన్నారు. అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఎం చాంబర్‌లోకి వెళుతుండగా అనుమతిలేదంటూ అధికారులు వారిని సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టారు.

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు - చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు - Chandrababu Take Charge as CM

Last Updated : Jun 14, 2024, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.