CM CHANDRABABU FIRE ON YS JAGAN: ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లీ-చెల్లిని కూడా రోడ్డుపైకి లాగిన జగన్ తమను నిందిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదని వ్యాఖ్యానించారు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే తనను విమర్శించకూడదని చెల్లికి కండిషన్లు పెట్టేవాడిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి కేంద్రం రైల్వే లైన్ ప్రకటన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ లాంటి వారితో రాజకీయం చేయాలంటే సిగ్గనిపిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఉన్నామని చెప్పుకునేందుకు కూడా ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారన్నారు. వంకర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇకనైనా జగన్ మానాలని హితవు పలికారు. విలువలు లేని రాజకీయం చేసి అందులో హీరోయిజం చేయాలనుకుంటే కల అని సూచించారు. విలువలు లేని మనుషులు సమాజానికి చేటని దుయ్యబట్టారు.
జగన్‌ని ఆపాలంటే ఎంతసేపు: తండ్రి సంపాదించిన ఆస్తి తల్లికి రాదా అని ప్రశ్నించిన సీఎం, 2004లో జగన్ ఆదాయం ఎంత అని, ఎక్కడి నుంచి ఈ లక్షల కోట్లు వచ్చాయని నిలదీశారు. ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడైనా పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించిన చంద్రబాబు, పది లక్షలు ఇచ్చే శక్తి ఇప్పుడు వచ్చిందా అని ధ్వజమెత్తారు. అయిదేళ్లు ఇంట్లో నుంచి తనను బయటకు రానివ్వలేదన్న చంద్రబాబు, ఇప్పడు తిరుతున్న జగన్‌ను ఆపాలంటే ఎంత సేపని వ్యాఖ్యానించారు.
"మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా?" - పలువురు మంత్రులకు చంద్రబాబు క్లాస్
CBN on National Highways: లక్ష్యాలను నిర్దేశించుకుని రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి 8 లేన్ల రహదారుల అవసరం ఉందన్నారు. హైవే ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్ అండ్ బీ, సీసీఎల్ఏ, ఫారెస్ట్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమన్వయంతో ఈ టాస్క్ ఫోర్స్ పని చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ముందుకు నడవక ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులు చేపడతామని స్పష్టం చేశారు.
గడ్కరీకి కృతజ్ఞతలు: 3 నెలల్లో భూ సేకరణ చేసి నిర్ణీత కాలపరిమితి లోగా అన్నీ పూర్తి చేస్తామన్నారు. కేంద్రం - రాష్ట్రం కాంట్రాక్టర్లకు సహకరిస్తాయని, అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని వారికి చెప్పామన్నారు. రాష్ట్రంలో 45 వేల 300 కోట్లతో 636 కిలోమీటర్లు మేర కొత్త రహదారుల అభివృద్ధి చేపట్టే ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు. రణస్థలం శ్రీకాకుళం రహదారికి ఆమోదం తెలిపిన గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Chandrababu on Constructions: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదానికి తగ్గట్టుగా స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ట్రూ స్పిరిట్‌తో ఫ్రీ సాండ్‌ని అమలు చేస్తూ నిర్మాణ రంగానికి చేయూతనిస్తున్నామన్నారు. ఇసుకను ఉచితం చేయటం వల్ల నిర్మాణ వ్యయం తగ్గి వేగం పుంజుకుంటుందని అబిప్రాయపడ్డారు. సహజ వనరులని ఏ విధంగా దోపీడీ చేశారో గత పాలకులను చూశామని, విధ్వంసం తమ విధానం కాదని తేల్చిచెప్పారు.
అనంతపురం - అమరావతి హైవే స్ఫూర్తిని గత పాలకులు మార్చినా, తాము సరైన మార్గంలో తీసుకెళ్తున్నామని వెల్లడించారు. కరవు రహిత రాష్ట్రంగా ఏపీని అభివృద్ధి చేసేందుకు వాటర్ పాలసీ తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఆలోచనా విధానాల్లో మార్పులు వల్ల పౌర సేవలు సులభతరం చేస్తున్నామని తెలిపారు. అమరావతి డ్రోన్ ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుందన్నారు.
72 రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు - రెండేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు