Clashes in AP Elections : ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాలపై టీడీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. మరి కొన్నిచోట్ల టీడీపీ ఏజెంట్లపై దాడి చేసి, వారిని కిడ్నాప్ చేశారు. వారిని వాహనాలను ధ్వంసం చేశారు. పలు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసి విధ్వంసాన్ని సృష్టించారు.
Nellore District : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని సల్మాన్ పురం, పంచేడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇసుకపల్లిలో అధికార నాయకులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ ఓటు వేయాలని అధికార నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. వారి టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.
అన్నమయ్యలో వైఎస్సార్సీపీ బరితెగింపు - టీడీపీ ఏజెంట్లపై దాడి, కిడ్నాప్ - YSRCP Leaders Attack
Sarvepalli Constituency : సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో 198వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. సర్వేపల్లి పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త 198 పోలింగ్ కేంద్రానికి రావడంతో గొడవకు దారితీసింది. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
పల్నాడులో వైఎస్సార్సీపీ దాష్టీకం - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Attack
అల్లూరులో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రామకృష్ణ జూనియర్ కాలేజీ ఆవరణలో టీడీపీ వైఎస్సార్సీపీ నేతలు బీద రవిచంద్ర, మల్లిమాల సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చెేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.