Citizens for Democracy Conference in Vijayawada: ఏపీలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే తరుణం ఆసన్నమైందన్నారు. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ సీఎస్ ఎల్వీ. సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్, ప్రముఖ వైద్యుడు జీ.సమరం తదితరులు పాల్గొన్నారు.
ఆ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు బంపరాఫర్ - రెండేసి ఓట్లు!
రానున్న ఎన్నికల్లో 'ఓటు వేద్దాం- ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేద్దాం' అనే అంశంపై చర్చించారు. విశేష అధికారాలు ఉన్న ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం ఓటుకు మాత్రమే ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు ఓటు నమోదులో కాలుష్యం ప్రవేశించి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విద్యావంతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచి మెరుగైన సమాజాన్ని నిర్మించుకునేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.
ఓటు నమోదులో కాలుష్యం ప్రవేశించిందని, జాబితాలో తప్పులుతడకలు ఉన్నాయని మాజీ సీఎస్ ఎల్వీ. సుబ్రహ్మణ్యం అన్నారు. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రస్తుత సమాజంలో ఓటును ఓ చిత్తు కాగితంలా మార్చేశారన్నారు. ఈ సామాజిక రుగ్మత మారాలన్న ఆయన ఓటర్లు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు జవాబుదారీగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు.
అనుయాయులు, మద్దతుదారులకు రెండుమూడు ఓట్లు - గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమాలు
"ఏపీలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే తరుణం ఆసన్నమైంది. విశేష అధికారాలు ఉన్న ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం ఓటుకు మాత్రమే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఓటు నమోదులో కాలుష్యం ప్రవేశించి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కావున విద్యావంతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచి మెరుగైన సమాజాన్ని నిర్మించుకునేందుకు కదలి రావాలి." - నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ ఎస్‌ఈసీ
"ప్రస్తుత సమాజంలో ఓటును ఓ చిత్తు కాగితంలా మార్చేశారు. ఈ సామాజిక రుగ్మత మారాలి. ఓటర్లు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు జవాబుదారీగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది ఓటు నమోదులో కాలుష్యం ప్రవేశించి జాబితాలో తప్పులుతడకలు ఉన్నాయి." - ఎల్వీ. సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్